Breaking News

టమాటాలపై సబ్సిడీ.. ఎన్‌సీసీఎఫ్‌ కీలక నిర్ణయం

Published on Sun, 07/28/2024 - 14:31

పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి.. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) సోమవారం నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో 60 రూపాయల సబ్సిడీ ధరకు టమాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో టమాట ధరలు భారీగా పెరగడంతో ఎన్‌సీసీఎఫ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జూలై 27న ఢిల్లీలో కేజీ టమాట ధర రూ.77 వద్ద ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ధరలు రూ. 80 దాటేసింది. ఈ ధరల నుంచి ఉపశమనం కలిగించడానికి ఎన్‌సీసీఎఫ్‌ రేపటి నుంచి (జులై 29) మెగా సేల్ ప్రారంభించనుంది. ఇందులో టమాటాల మీద సబ్సిడీ కూడా లభిస్తుంది.

కృషి భవన్, సీజీఓ కాంప్లెక్స్, లోధి కాలనీ, హౌజ్ ఖాస్, పార్లమెంట్ స్ట్రీట్, ఐఎన్ఏ మార్కెట్, నోయిడా, రోహిణి, గురుగ్రామ్‌లోని అనేక ప్రాంతాలలోని వివిధ ప్రదేశాలలో టమాటాలు సబ్సిడీ ధరతో కొనుగోలు చేయవచ్చని ఎన్‌సీసీఎఫ్‌ వెల్లడించింది.

పెరుగుతున్న ఆహార ధరల నుంచి వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించడానికి కేంద్రం సబ్సిడీ ప్రవేశపెట్టింది. సబ్సిడీ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. గత ఏడాది కూడా ఇదే సమయంలో టమాట ధరలు భారీగా పెరిగాయి. అప్పుడు కూడా ఎన్‌సీసీఎఫ్‌ సబ్సిడీ అందించింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)