Breaking News

సాక్షి మనీ మంత్రా: బ్యాంకుల దెబ్బ, భారీ నష్టాలు

Published on Thu, 08/03/2023 - 15:38

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. బలహీనమైన ప్రపంచ సూచనల  మధ్యరోజంతా అమ్మకాలు కనిపించాయి. యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల సుదీర్ఘ ఎఫ్‌ఐఐ విక్రయాలు దేశీయ మార్కెట్‌లో జోష్‌ మూడ్‌కు అంతరాయంగా మారాయి. చివరకి సెన్సెక్స్‌ 542 నష్టంతో 65,240.68 వద్ద, నిఫ్టీ  145 పాయింట్లు కుప్పకూలి 19,382 వద్ద స్థిరపడింది.  నిఫ్టీ 19,400 దిగువకు చేరింది. 

సెక్టార్ల పరంగా చూస్తే ఫార్మా ఇండెక్స్ 1 శాతం లాభపడగా, బ్యాంక్, మెటల్, ఆయిల్ & గ్యాస్,రియల్టీ 1-2 శాతం చొప్పున క్షీణించాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్‌లో ముగిశాయి. ఫార్మా , మీడియా మాత్రమే లాభపడ్డాయి. అదానీ స్టాక్స్ , సన్ ఫార్మా దూసుకుపోయాయి. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఐషర్‌ మోటార్స్‌ , దివీస్‌ ల్యాబ్స్‌, ఇన్ఫోసిస్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలచాయి. యూపీఏ  టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ టాప్‌ లూజర్స్‌గా మిగిలాయి.

క్యూ1  ఫలితాల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభాలనార్జించింది. నికర లాభం గతంలోని రూ. 469  కోట్లతో పోలిస్తే 44శాతం పెరిగి రూ. 674 కోట్లగా ఉంది.   కానీ  ఆదాయం మాత్రం పడిపోయింది. రూ. 40,844 కోట్ల పోలిస్తే 38శాతం తగ్గి రూ. 25,438  కోట్లకు చేరుకుంది.

రూపాయి: డాలరు పుంజుకోవడంతో రూపాయి బలహీనత కొనసాగుతోంది. గురువారం  మరో రూ 0.18 తగ్గింది. చివరికి గత ముగింపు 82.58తో పోలిస్తే డాలర్‌ మారకంలో 15 పైసలు తగ్గి 82.73 వద్ద ముగిసింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)