శ్రావణమాసం.. అక్కడ మాత్రమే పెరిగిన బంగారం ధరలు

Published on Mon, 08/05/2024 - 11:34

ఆషాడం ముగిసింది.. శ్రావణ మాసం వచ్చేసింది. ఇక బంగారం పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు కొనసాగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 5) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.

చెన్నైలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 200 (22 క్యారెట్స్), రూ. 220 (24 క్యారెట్స్) పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 70580 వద్దకు చేరాయి.

దేశ రాజధాని నగరంలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70730 వద్ద ఉంది.

వెండి ధరలు
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఆదివారం స్థిరంగా ఉన్న సిల్వర్ సోమవారం రూ. 200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 85,700లకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)