ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే..

Published on Sat, 09/14/2024 - 14:29

బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కేవలం రెండు రోజుల్లోనే తులం గోల్డ్ రేటు ఏకంగా రూ. 1740 పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లోనూ ఇదే వరుస కొనసాగుతోంది. ఈ రోజు (సెప్టెంబర్ 14) బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా శనివారం పసిడి ధరలు వరుసగా రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 440 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68650 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.74890 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68650 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 74890గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 400, రూ. 440 పెరిగినట్లు స్పష్టమవుతోంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 68800 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.75040 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 1200, రూ. 1300 పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 400, రూ. 440 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్న రూ. 89,500 వద్ద ఉన్న వెండి.. ఈ రోజు రూ. 2500 పెరుగుదలతో రూ. 92000 (కేజీ) వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)