బంగారం బాటలోనే వెండి.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Published on Thu, 06/13/2024 - 11:22

ఇటీవల ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధరలు నెమ్మదిగా పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. అయితే నేడు (జూన్ 13) పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీ, చైన్నైలలో తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66150 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.72160 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66250 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72310 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర మాత్రం రూ. 50 తగ్గింది. 24 క్యారెట్స్ ధరలు మాత్రమే నిన్న మాదిరిగానే ఉన్నాయి.

చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 210తగ్గి.. రూ. 66600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 72660 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద నిలిచాయి. ధరలు తగ్గినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 13) ఒక కేజీ వెండి ధర రూ. 90700 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు ఏకంగా రూ. 600 తగ్గింది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)