Breaking News

గుడ్‌ న్యూస్‌: అమెరికా షాక్‌, దిగొస్తున్న పసిడి

Published on Fri, 08/11/2023 - 12:55

Today Gold and silver Price: దేశంలో పసిడి ధరలు శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గురువారం రూ. 250  తగ్గిన పసిడి ఈ రోజు మరింత దిగి వచ్చింది.  హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 54,550 వద్ద ఉంది. గురువారం ఈ ధర రూ. 54,700గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.59, 510 గా ఉంది. దాదాపు ఉభయ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో విలువైన మెటల్‌ వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. స్వల్పంగా పడి కిలో వెండి ధర  రూ.76200 వద్ద కొనసాగుతుంది.  (లగ్జరీ ఎస్టేట్‌ కొనుగోలు చేసిన జెఫ్‌ బెజోస్‌: ప్రియురాలి కోసమేనా?)

అంతర్జాతీయంగానూ వెండి,బంగారం ధరలు వెనకడుగువస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు  ఆశాజనకంగా ఉండటంతో గురువారం పెరిగిన ధరలు నేడు దిగివ చ్చాయి. ఎంసీక్స్‌ గోల్డ్ ఫ్యూచర్స్ (అక్టోబర్ 5) చివరి లెక్కన 10 గ్రాములకు రూ. 58,810 వద్ద స్థిరంగా ఉంది. వెండి ఫ్యూచర్స్ (సెప్టెంబర్ 5) 0.12 శాతం లేదా రూ.86 తగ్గి కిలో రూ.69,895 వద్ద ఉంది.గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్‌ను  రూ. 59,200 స్టాప్ లాస్‌తో రూ.  59,950 వద్ద విక్రయించాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు.  

అయితే జూలై డేటా ప్రకారం  అమెరికా  వినియోగదారుల ధరలు మధ్యస్తంగా ఉన్నాయి. గురువారం బంగారం ధరలు పెరిగాయి. అలాగే ఫెడ్‌ వడ్డీ వడ్డనలో కాస్త ఉపశమనం లభిస్తుందనే అంచనాలున్నాయి. సీపీఐ నెమ్మదిగా తగ్గుతూ ఉండటంతో, ముఖ్యంగా సెప్టెంబర్ రివ్యూలో వడ్డీ రేట్లను పెంపు ఉండకపోవచ్చని హై రిడ్జ్ ఫ్యూచర్స్‌ మెటల్స్ ట్రేడింగ్ డైరెక్టర్ డేవిడ్ మెగర్ అన్నారు.

 దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌  312 కుప్పకూలి 65, 365 వద్ద ఉండగా,నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 19,444 వద్ద కొనసాగుతోంది. 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు