Breaking News

ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు?.. ఐటీ శాఖ రూల్స్ తెలుసా!

Published on Tue, 10/20/2026 - 08:30

భారతీయులకు బంగారంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఎందుకంటే పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. ఇలా ఎప్పటికప్పుడు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తూనే ఉంటారు. చాలామంది బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే ఆస్తిగా కూడా భావిస్తారు. అందుకే.. తమ స్థోమతకు తగ్గట్టుగా బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకుంటారు.

అయితే.. ఇంట్లో ఎంత బంగారం నిల్వ చేసుకోవచ్చు?, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయా?, బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి పన్నులు చెల్లించాలి?, ఇలాంటి విషయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.

బంగారం కొనుగోలుపై పన్నులు
మనదేశంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు.. కొన్ని పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం బంగారం విలువపై 3 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఆభరణాల తయారీ ఛార్జీలపై సాధారణంగా 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అంతే కాకుండా.. రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో బంగారం కొనుగోలు చేస్తే పాన్‌ కార్డు, నగదు లావాదేవీలకు సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయి. అందువల్ల.. కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకోవడం, చెల్లింపులకు సంబంధించిన రికార్డులను భద్రపరచుకోవడం మంచిది.

బంగారం ధరలపై దిగుమతి సుంకాల ప్రభావం
బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారత్ ఒకటి. ఈ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ సుంకాలను విధిస్తుంది. దిగుమతి సుంకాల్లో మార్పులు వచ్చినప్పుడు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే.. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు, రూపాయి విలువ, ఇతర మార్కెట్‌ పరిస్థితులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు?
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఇంట్లో ఇంత బంగారం మాత్రమే ఉంచుకోవాలి అనే నిబంధన ఏమి లేదు. కానీ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది?, ఎలా కొనుగోలు చేశారు?, దానికి సంబంధించిన ఆదాయ వనరులు ఏమిటి? అనే విషయాలకు ఆధారాలు ఉండాలి.

ఆదాయపు పన్ను శాఖ మార్గదర్శకాల ప్రకారం.. వివరణ లేకుండా పెద్ద మొత్తంలో బంగారం నిల్వ ఉంచినప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంగారం కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, వారసత్వంగా వచ్చిన బంగారానికి సంబంధించిన వివరాలు, బహుమతులుగా అందిన బంగారానికి సంబంధించిన ఆధారాలను తప్పకుండా భద్రపరచుకోవాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బంగారం కొనుగోలు చేసిన ప్రతిసారీ బిల్లును భద్రపరచుకోవాలి. కొనుగోలు మొత్తానికి సంబంధించిన చెల్లింపు రికార్డులు కూడా ఉంచుకోవాలి. వారసత్వంగా వచ్చిన లేదా కుటుంబ సభ్యుల నుంచి బహుమతిగా పొందిన బంగారానికి సంబంధించిన వివరాలను సాధ్యమైనంతవరకు నమోదు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే భవిష్యత్తులో అనవసరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చు.

ఇదీ చదవండి: గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయ్‌.. ఇకపై ఏం జరగబోతోంది?

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)