Breaking News

బంగారం ఎంత కొనచ్చు? పెళ్లికానివారికైతే అంతే!

Published on Wed, 01/01/2025 - 18:50

భారత దేశంలో బంగారాన్ని (Gold) సంపదకు, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. మన సంప్రదాయాలలో పసిడి లోతుగా పాతుకుపోయింది. బంగారం కొనడాన్ని భారతీయులు అదృష్టంగా భావిస్తారు. ముఖ్యంగా పండుగ సందర్భాలలో పుత్తడి కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. నాణేలు, ఆభరణాలు.. ఇలా వివిధ రూపాల్లో బంగారాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటారు.

అంతటి ప్రాధాన్యత ఉన్న బంగారాన్ని కొనడానికి ముందు దానికి సంబంధించిన నిబంధనలను తెలుసుకోవడం, అనుసరించడం కూడా అంతే ముఖ్యం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్గదర్శకాల ప్రకారం, డిక్లేర్డ్ ఆదాయం, వ్యవసాయ ఆదాయం, సహేతుకమైన గృహ పొదుపులు లేదా చట్టబద్ధంగా సంక్రమించిన ఆస్తులతో కొనుగోలు చేసిన బంగారంపై ఎటువంటి పన్నులు ఉండవు. ఇలా కాకుండా వేరే మార్గాల ద్వారా సమకూర్చుకున్న బంగారం పరిమితులకు మించి ఉంటే అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.

ఎంత బంగారం ఉండొచ్చు?
వివాహిత మహిళలు: 500 గ్రాముల వరకు
అవివాహిత స్త్రీలు: 250 గ్రాముల వరకు
పురుషులు (వివాహితులు, అవివాహితులు ఎవరైనా): 100 గ్రాముల వరకు

బంగారం.. పెట్టుబడి మార్గం
స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు బాండ్లతో పాటు బంగారం కూడా చాలా కాలంగా విశ్వసనీయ పెట్టుబడి ఎంపికగా ఉంది. సంపదను పెంచుకోవడానికి ఇది నమ్మదగిన మార్గంగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs) వంటి బంగారు పెట్టుబడుల కొత్త రూపాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ భౌతిక బంగారాన్ని ఇష్టపడుతున్నారు. వివిధ రకాల గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు వాటి నిబంధనలను పరిశీలిస్తే..

ఫిజికల్ గోల్డ్: పురుషులు 100 గ్రాముల వరకు కలిగి ఉండవచ్చు. వివాహిత మహిళలు 500 గ్రాములు, అవివాహిత స్త్రీలు 250 గ్రాములు గరిష్టంగా కలిగి ఉండవచ్చు. మూడు సంవత్సరాల తర్వాత భౌతిక బంగారాన్ని విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20 శాతంతోపాటు సెస్ చెల్లించాల్సి ఉంటు​ంది. అయితే స్వల్పకాలిక అమ్మకాలపై ఆదాయ స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను ఉంటుంది. అలాగే కొనుగోళ్లపైనా 3% జీఎస్టీ (GST) ఉంటుంది.

డిజిటల్ గోల్డ్: ఇది మరింత అనుకూలమైన ఎంపిక. డిజిటల్ గోల్డ్‌లో నిల్వ అవాంతరాలు ఉండవు. ఉపసంహరణపై మాత్రమే పన్నులు వర్తిస్తాయి. దీనిపై పెట్టే రోజువారీ ఖర్చు రూ. 2 లక్షలకు పరిమితం.

సావరిన్ గోల్డ్ బాండ్‌: ఈ బాండ్‌లు సంవత్సరానికి 4 కిలోల వరకు పెట్టుబడిని అనుమతిస్తాయి. దీనిపై 2.5% వార్షిక వడ్డీ లభిస్తుంది. అయితే ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత వీటి నుండి వచ్చే లాభాలు పన్ను రహితంగా ఉంటాయి.

గోల్డ్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు: వీటి నుండి వచ్చే లాభాలపై భౌతిక బంగారంతో సమానంగా పన్ను ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలపై మూడేళ్ల తర్వాత 20 శాతం పన్ను విధిస్తారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)