Breaking News

థాయ్‌లాండ్ వెళ్లేవారికి కొత్త రూల్స్‌.. ముఖ్యంగా ‘క్యాష్‌’

Published on Sun, 07/05/2026 - 10:56

భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన విదేశీ గమ్యస్థానాల్లో థాయ్‌లాండ్ ఒకటి. అయితే తాజాగా అక్కడి ప్రవేశ నిబంధనలు కఠినతరం కావడంతో ప్రయాణానికి ముందు అవసరమైన పత్రాలు, వీసా, ఇతర షరతులను తప్పనిసరిగా పరిశీలించాలని బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. జూలై 2న విడుదల చేసిన తాజా అడ్వైజరీలో భారతీయులు థాయ్‌లాండ్‌కు బయలుదేరే ముందు పాటించాల్సిన కీలక మార్గదర్శకాలను వెల్లడించింది. ఇటీవల భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు అమల్లో ఉన్న వీసా-రహిత ప్రవేశ విధానంలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది.

రాయబార కార్యాలయం సూచనల ప్రకారం.. థాయ్‌లాండ్ చేరుకునే తేదీ నుంచి కనీసం ఆరు నెలల గడువు ఉన్న చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ తప్పనిసరి. అలాగే కన్ఫర్మ్ అయిన రిటర్న్ విమాన టికెట్, హోటల్ బుకింగ్, స్పష్టమైన ట్రావెల్ ఇటినరరీ (ప్రయాణ ప్రణాళిక) వెంట ఉండాలి. ప్రయాణికులు దేశంలో అడుగుపెట్టే 72 గంటల ముందు థాయ్‌లాండ్‌ డిజిటల్‌ అరైవల్‌ కార్డ్‌ (TDAC)ను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా పూర్తి చేయాలి. దానికి సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ను ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో చూపించాల్సి ఉంటుంది.

వీసా, నగదు నిబంధనలు

ప్రయాణ ఉద్దేశానికి అనుగుణంగా సరైన వీసా పొందాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్ (VOA) లేదా వర్తించే ప్రవేశ సదుపాయాన్ని వినియోగించే ప్రయాణికులు ఒక్కొక్కరు కనీసం 20,000 థాయ్ బాట్‌లు (సుమారు రూ.57,000–58,000) నగదు వెంట ఉంచుకోవాలని సూచించింది. అవసరమైతే దీనికి సంబంధించిన ఆధారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉద్యోగం కోసం వెళ్తుంటే జాగ్రత్త

థాయ్‌లాండ్‌లో ఉద్యోగం పొందిన వారు పర్యాటక వీసా లేదా వీసా ఆన్ అరైవల్‌పై దేశంలోకి ప్రవేశించకూడదని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఉపాధి కోసం వెళ్లేవారు ముందుగానే తగిన వర్క్ లేదా సంబంధిత వీసా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్థానిక ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది. అలాగే థాయ్‌లాండ్ మీదుగా మరో దేశానికి వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికులు తమ తుది గమ్యస్థానానికి అవసరమైన వీసాలు, టికెట్లు, ఇతర పత్రాలను కూడా వెంట ఉంచుకోవాలని సూచించింది.

ముఖ్యమైన చెక్‌లిస్ట్ ఇదే..

  • చేరుకునే తేదీ నుంచి కనీసం 6 నెలల గడువు ఉన్న పాస్‌పోర్ట్.

  • కన్ఫర్మ్ అయిన రిటర్న్ టికెట్.

  • ధ్రువీకరించిన హోటల్ బుకింగ్.

  • పూర్తి ప్రయాణ ప్రణాళిక.

  • ప్రయాణానికి 72 గంటల ముందు పూర్తి చేసి TDAC క్యూఆర్‌ కోడ్‌

  • ప్రయాణ ఉద్దేశానికి తగిన వీసా

  • వెంట కనీసం 20,000 థాయ్ బాట్‌ల నగదు.

  • ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌కు వెళ్లే ముందు అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం.

  • గ్రూప్‌గా వెళ్లినా ప్రతి ప్రయాణికుడు తన సొంత పత్రాలు కలిగి ఉండడం.

  • ఉద్యోగం కోసం వెళ్తుంటే టూరిస్ట్ ఎంట్రీ సదుపాయాలను ఉపయోగించకపోవడం.

  • ట్రాన్సిట్ ప్రయాణికులు తుది గమ్యస్థానానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవడం.

ప్రయాణానికి ముందు తాజా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా అర్హతలు, అవసరమైన పత్రాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. దీంతో థాయ్‌లాండ్‌లో ప్రవేశ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, ప్రయాణం సాఫీగా సాగుతుందని పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)