Breaking News

Tesla Electric Cars: టెస్లాకు భారీ దెబ్బ...!

Published on Mon, 06/28/2021 - 12:53

బీజింగ్‌: ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలోని సుమారు 2,85,000  ఎలక్ట్రిక్‌  కార్లను వెనక్కి పిలవనుంది. టెస్లా కార్లలోని అసిస్టెడ్‌ డ్రైవింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు నెలకొన్నాయని పరిశోధనలో తేలింది. ఈ సాంకేతిక సమస్యతో రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. టెస్లా కార్లలో  క్రూయిజ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఒక్కసారిగా ఆక్టివేట్‌ అయ్యి, ఒక్కసారిగా వేగం పెరిగే ప్రమాదం ఉన్నందున్న వాటిని సరిచేసేందుకే వెనక్కి పిలుస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ఈ సమస్యను టెస్లా మోడల్‌ 3, మోడల్‌ వై కార్లలో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సంఖ్యలో కార్లను వెనక్కి పిలవడం కంపెనీకి భారీ దెబ్బ అని ఆటోమొబైల్‌ రంగ నిపుణులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా టెస్లా కార్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో చైనా పౌరులు సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలో టెస్లాను లక్ష్యంగా చేసుకొని ఫిర్యాదులను నమోదు చేస్తున్నారు. టెస్లా కార్లను కంపెనీకి తీసుకెళ్తే, క్రూయిజ్‌ కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తామని టెస్లా తెలిపింది. కాగా అంతకుముందు చైనా మిలటరీ వ్యవస్థ టెస్లాకు సంబంధించిన కార్లు గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: చరిత్ర సృష్టించనున్న ఎలన్‌ మస్క్‌..!

Videos

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

Photos

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)