Breaking News

20 లక్షల టెస్లా కార్లు వెనక్కి.. కారణం ఏంటంటే?

Published on Mon, 12/18/2023 - 16:34

అగ్రరాజ్యం అమెరికాలో టెస్లా కంపెనీ సుమారు 20 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. సంస్థ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏంటి? కారులో రీప్లేస్ చేయాల్సిన భాగాలూ ఏమైనా ఉన్నాయా.. అనే మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా.. కంపెనీకి చెందిన దాదాపు రెండు మిలియన్స్ కార్లలో ఆటోపైలట్ సిస్టమ్‌లోని లోపాన్ని సరి చేయడానికి రీకాల్ చేసింది. ఇందులో 2015 నుంచి మార్కెట్లో విక్రయించిన కార్లు ఉన్నట్లు సమాచారం. ఆటోపైలట్ యాక్టివేట్ సిస్టం అనేది సెల్ఫ్-డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు రోడ్డు, ట్రాఫిక్ పరిస్థితుల గురించి డ్రైవర్‌ను హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది.

టెస్లా ఆటోపైలట్ సిస్టమ్‌ అనేక ప్రమాదాలకు దారితీసినట్లు అమెరికా 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' వెల్లడించింది. ఈ దర్యాప్తు మొదలైన సుమారు రెండు సంవత్సరాల తర్వాత కంపెనీ ఈ సమస్య పరిష్కారానికి రీకాల్ ప్రకటించడం జరిగింది. 

ఇదీ చదవండి: రూ.350 కోట్లతో 500 అడుగుల గడియారం - రంగంలోకి జెఫ్ బెజోస్..

సెల్ఫ్ డ్రైవ్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు డ్రైవర్‌ను ఉంచడానికి ఆటోపైలట్ చర్యలు సరిపోకపోవచ్చని, తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పరిశోధనలో తేలింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో టెస్లా మోడల్ వై, ఎస్, 3 మాత్రమే కాకుండా 2012 నుంచి 2023 మధ్య ఉత్పత్తి అయిన టెస్లా మోడల్ ఎక్స్ కూడా ఉన్నాయి. కంపెనీ నిర్దేశించిన సమయంలో టెస్లా కార్లను కొనుగోలు చేసిన వాహన వినియోగదారులు వారి కారులోని సమస్యను ఇప్పుడు రీకాల్ సమయంలో సులభంగా పరిష్కరించుకోవచ్చు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు