లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం
Breaking News
ప్లాంటుపై టెస్లాకు ఆసక్తి లేదు
Published on Sun, 06/29/2025 - 06:14
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు భారత్‌లో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంపై పెద్దగా ఆసక్తి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి పునరుద్ఘాటించారు. ఇక్కడ తమ కార్ల విక్రయాల కోసం షోరూమ్‌లను తెరవడంపై మాత్రమే కంపెనీ ఆసక్తిగా ఉందని చెప్పారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహ నాల తయారీపై ఇన్వెస్ట్ చేసే సంస్థలకు దిగుమతి సుంకాలపరంగా ప్రోత్సాహకాలిచ్చే స్కీమునకు సంబంధించి పోర్టల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అక్టోబర్ 21 వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుంది.
అవసరాన్ని బట్టి 2026 మార్చి 15 వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీ పరిశ్రమల శాఖ అప్లికేషన్ విండోను తిరిగి ప్రారంభించవచ్చు. 4–5 వాహన కంపెనీలు ఈ పథకంపై ప్రాథమికంగా ఆసక్తి కనపర్చాయని, అయితే వాస్తవంగా ఎన్ని దరఖాస్తులు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుందన్నారు. స్కీములో పాలుపంచుకోవాలంటూ జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర అన్ని దేశాల వాహన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని.. అయితే చైనా, పాకిస్తాన్‌లాంటి పొరు గు దేశాల సంస్థలకు ఆంక్షలు వర్తిస్తాయన్నారు. కొత్త ఈవీ పథకం ప్రకారం, భారత్‌లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వాహన సంస్థలు, 15% సుంకానికే 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ సుంకాలు 70–100 శాతం వరకు ఉంటున్నాయి.
Tags : 1