Breaking News

పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ కొత్త వ్యూహం

Published on Tue, 08/22/2023 - 10:05

న్యూఢిల్లీ: ఆర్టిఫియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ స్టాక్‌ అభివృద్ధికి ఏఐపై పెట్టుబడులు పెడుతున్నట్టు పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు. మార్కెట్‌కు సేవలు అందించడం, దీర్ఘకాలం పాటు లాభదాయక వ్యాపారంగా పేటీఎంను తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. భారత్‌లో 50 కోట్ల చెల్లింపుల కస్టమర్లు, 10 కోట్ల వర్తకుల లక్ష్యం ఎంతో దూరంలో లేదన్నారు. వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం) వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి రాసిన లేఖలో శర్మ ఈ విషయాలు తెలియజేశారు. ఏఐ విస్తరణతో రిస్క్‌లు, మోసాల నుంచి ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌కు రక్షణ ఏర్పడుతుందన్నారు. చెల్లింపుల సాంకేతికత, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ ఎగుమతి చేయడానికి భారత్‌ ముందు అవకాశాలున్నట్టు చెప్పారు. ఈ మార్గంలో పేటీఎం ముందుంటుందని ప్రకటించారు. (హానర్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌: స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌!)

పేటీఎం ల్యాబ్‌ ఎప్పటికప్పుడు ఏఐ, బిగ్‌ డేటా ఫీచర్లను అభివృద్ధి చేస్తోందని చెబుతూ.. వినియోగదారులు, వర్తకులు పేటీఎం వినియోగించే విషయంలో విశ్వసనీయతకు ఇది దారితీస్తున్నట్టు చెప్పారు. చెల్లింపులు, రుణ సేవలకే పరిమితం కాకుండా, ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డీసీ)తో లభించే వ్యాపార అవకాశాల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు శర్మ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఇందుకు సంబంధించి మంచి ఫలితాలను చూస్తారని వాటాదారులకు భరోసా ఇచ్చారు. ఈ దిశగా పేటీఎం నిపుణులు పనిచేస్తున్నట్టు చెప్పారు.  
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)