Breaking News

టెలిగ్రామ్‌లో గ్రోక్‌ఏఐ పాగా

Published on Thu, 05/29/2025 - 14:14

కృత్రిమ మేధకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దాంతో ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌లు ఏఐను తమ ప్లాట్‌ఫామ్‌ల్లో భాగం చేస్తున్నాయి. అందులో భాగంగా టెలిగ్రామ్‌ ఎక్స్‌ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు టెలిగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎక్స్‌ఏఐ గ్రోక్‌ చాట్‌బాట్‌ను వాడేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దాంతోపాటు టెలిగ్రామ్‌ ద్వారా విక్రయించిన ఎక్స్ఏఐ సబ్స్క్రిప్షన్ల నుంచి ఇరు కంపెనీలకు 50 శాతం ఆదాయ భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొన్నాయి.

టెలిగ్రామ్‌కు ఉన్న యూజర్ బేస్‌ గ్రోక్ విస్తరణకు కూడా ఎంతో తోడ్పడుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. సంభాషణాత్మక ఏఐ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ చాట్‌బాట్‌ను టెలిగ్రామ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్‌ దురోవ్‌ తన ఎక్స్‌ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించినా, ఎక్స్‌ఏఐ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.

ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామం

మార్కెట్‌లో ఇప్పటికే వాట్సప్‌, గూగుల్‌చాట్‌ వంటి మేసేజింగ్‌ యాప్‌ల్లో మెటా లామా, జెమిని వంటి ఏఐ టూల్స్‌ సేవలందిస్తున్నాయి. ఈ కంపెనీలకు మాతృసంస్థలుగా ఉన్న మెటా, గూగుల్‌ సొంతంగా తయారు చేసిన ఈ ఏఐ టూల్స్‌ను వాడుతున్నాయి. అయితే టెలిగ్రామ్‌కు ఆ అవకాశం లేదు. దాంతో తన ప్లాట్‌ఫామ్‌లో ఏఐ టూల్‌ వాడేందుకు ఎక్స్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకుందనే వాదనలున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)