Breaking News

లక్ష మందికి AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ

Published on Mon, 11/02/2026 - 17:25

తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వంపై గానీ, కళాశాలలు లేదా విద్యార్థులపై గానీ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ‘తెలంగాణ ఏఐ అండ్ క్లౌడ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్’లో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టాస్క్, ఏడబ్ల్యూఎస్ మధ్య జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... రాష్ట్రంలోని 643 టాస్క్ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ తదితర ఇండస్ట్రీ ఓరియెంటెడ్ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రత్యక్షంగా ప్రాక్టికల్స్ చేసేందుకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కన్సోల్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్ తదితర నాన్ స్టెమ్ కోర్సుల విద్యార్థులకు కూడా ప్రత్యేక లెర్నింగ్ ట్రాక్స్ అందుబాటులో ఉంటాయన్నారు.

ఈ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి ‘ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్’ ద్వారా 900 కంటే ఎక్కువ డిజిటల్ కోర్సులను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు.  గ్లోబల్ సర్టిఫికేషన్ పరీక్షల కోసం డిస్కౌంట్ వోచర్లను కూడా అందిస్తామన్నారు. విద్యార్థులకు సాంకేతిక నిపుణులతో ఇండస్ట్రీ కనెక్ట్ సెషన్లు, హ్యాకథాన్లను నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్హులైన విద్యార్థులకు టాస్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఆయా కళాశాల్లోని అధ్యాపకులకు కూడా ఏఐ, క్లౌడ్ సాంకేతికతలో ప్రపంచస్థాయి శిక్షణ అందిస్తామన్నారు.

కార్యక్రమంలో ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి, టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి , ఏడబ్ల్యూఎస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ సందీప్ దత్తా, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ హెడ్ అభినవ్, కంట్రీ మేనేజర్(స్కిల్లింగ్ & సోషల్ ఇంపాక్ట్) ప్రతిభా, ఏడబ్ల్యూఎస్ అకాడమీ టీపీఎం ఆకాంక్ష రాయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రూ.12000 లకే కొత్త స్మార్ట్‌ ఫోన్లు వచ్చేశాయ్‌..!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)