Breaking News

‘టెక్‌ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..

Published on Thu, 04/16/2026 - 19:35

టీసీఎస్‌ (TCS) నాసిక్‌ బీపీవోలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడులపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరో ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రాపైనా ఇదే రకమైన మతపరమైన పక్షపాత ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముంబై గోరేగావ్‌ ఐటీ పార్క్‌లో ఈ సంస్థకు చెందిన బీపీపీ కార్యాలయంలో మతపరమైన పక్షపాతం, వివక్షపూరిత నియామక పద్ధతులు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

బాంబే హైకోర్టు న్యాయవాది అశుతోష్ దూబే తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ఉద్యోగి పంపిన సందేశాన్ని షేర్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సదరు కార్యాలయంలోని హెచ్‌ఆర్ విభాగం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారినే ఎక్కువగా నియమిస్తోందని, కార్యాలయ నిబంధనలు కూడా పక్షపాతంగా ఉన్నాయని ఆ సందేశంలో ఆరోపించారు.

ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు క్యాంటీన్‌లో ఇఫ్తార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని, ఆ సమయంలో ప్యాంట్రీ ఏరియాలోకి ఇతరులు పాదరక్షలతో రావద్దంటూ ఏర్పాటు నోటీసులకు సంబంధించిన ఫోటోలనూ దూబే షేర్‌ చేశారు. దీనివల్ల తాము "మినీ పాకిస్తాన్‌లో" పని చేస్తున్నట్లు అనిపిస్తోందని, అక్కడ పనిచేయడం అసౌకర్యంగా ఉందంటూ ఒక ఉద్యోగి వాపోయినట్లుగా దూబే పేర్కొన్నారు. అలాగే, నియామకాల్లో పారదర్శకత లేదని, కార్పొరేట్ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది అశుతోష్ దూబే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన టెక్‌  మహీంద్రా యాజమాన్యం
ఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు, ఫోటోలు పూర్తిగా "నిరాధారమైనవి" అని కొట్టిపారేసింది. తాము నిర్వహించిన అంతర్గత సమీక్షలో అటువంటి వివక్షపూరిత సంఘటనలు ఏవీ జరగలేదని తేలిందని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. ముఖ్యంగా వైరల్ అవుతున్న 'ఫుట్‌వేర్ ఫ్రీ జోన్' నోటీసు అసలు తమ కార్యాలయానికే చెందినది కాదని, నియామక ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని కంపెనీ వెల్లడించింది.

తమ సంస్థ సర్వమత సమానత్వాన్ని పాటిస్తుందని, సమ్మిళిత, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యతని టెక్ మహీంద్రా పేర్కొంది. మతం, కులం లేదా ఇతర ప్రాతిపదికన ఎలాంటి వివక్షను సహించబోమని, ప్రతి ఉద్యోగిని నిష్పాక్షికంగా చూస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కార్పొరేట్ విలువలను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరింది.

ఇదీ చదవండి: కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్‌ఆర్‌ సైలెంట్‌!

Videos

"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!

Breaking News: పూడి శ్రీహరికి బెయిల్

BC నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక సమావేశం

Delhi Airport: ఢీకొన్న రెండు విమానాలు

వడదెబ్బకు విరుగుడు! ఈ 3 తింటే సేఫ్ .. బాడీని కూల్ చేసే ఫుడ్స్

హీరోలు అంత ఫిట్ గా ఎలా ఉంటున్నారో తెలుసా? వీరి డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు!

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వల్లభనేని వంశీ ఫిర్యాదు

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయం చేయొద్దు

LIVE:లష్కరే టాప్‌ కమాండర్‌పై కాల్పులు...

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

Photos

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. ప్రముఖ మ్యాగజైన్‌పై గ్లోబల్ స్టార్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)