Breaking News

టీసీఎస్‌.. ఇన్ఫోసిస్‌కు ప్రత్యర్థి కాదా?

Published on Sat, 10/12/2024 - 19:06

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తనకు, దివంగత రతన్ టాటాకు  మధ్య 2004లో జరిగిన ఆసక్తికరమైన సంఘటన గుర్తు చేసుకున్నారు. ఇన్ఫోసిస్‌లో జంషెడ్‌జీ టాటా రూమ్‌ను ప్రారంభించేందుకు ఇన్ఫోసిస్ ఆహ్వానించినప్పుడు రతన్ టాటా ఆశ్చర్యపోయారని మూర్తి చెప్పారు.

ఇన్ఫోసిస్‌కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పోటీదారుగా ఉన్నప్పటికీ తనను ఎందుకు ఆహ్వానించారని రతన్ టాటా అడిగారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రతన్ టాటా టీసీఎస్‌ సంస్థకు నాయకత్వం వహించేశారు. టాటా సందేహానికి మూర్తి మర్యాదపూర్వకంగా బదులిస్తూ, జంషెడ్‌జీ టాటా కంపెనీలకు అతీతమైనవారని, గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌కు టాటా గ్రూప్‌ను పోటీదారుగా తాను ఎన్నడూ భావించలేదని, రతన్ టాటా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున రూమ్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని రతన్ టాటాకు చెప్పారు.

ఇదీ చదవండి: రతన్‌ టాటా మళ్లీ బతికొస్తే..

తర్వాత టాటా ఆహ్వానాన్ని మన్నించారని, ఈ కార్యక్రమం తనకు జ్ఞాపకంగా మారిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. రతన్‌ టాటాకు కాస్త సిగ్గుపడే స్వభావం ఉందని, దీంతో అప్పడు సుదీర్ఘ ప్రసంగం చేసే మూడ్‌లో లేరని చెప్పుకొచ్చారు. అయితే రతన్ టాటా పర్యటన తమ టీమ్‌పై చాలా ప్రభావం చూపిందని, ఇన్ఫోసిస్‌ సిబ్బందితో సమయం గడిపారని మూర్తి గుర్తు చేసుకున్నారు. రతన్‌ టాటా వినయం, దయ, దేశభక్తి ఉన్న గొప్ప వ్యక్తి అని నారాయణమూర్తి కొనియాడారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)