Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలకు టీసీఎస్ సన్నద్ధం

Published on Tue, 10/14/2025 - 13:23

ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించిన నేపథ్యంలో అందుకు టెక్నాలజీ సపోర్ట్‌ అందించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 5జీ కనెక్టివిటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. దాంతో టెలికాం పరికరాల విభాగంలో టీసీఎస్‌ ఎదిగేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది. గ్లోబల్ టెలికాం కంపెనీలు ఇప్పటికే భారతదేశ టెలికాం రంగంపై ఆసక్తి చూపుతున్నాయని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ సక్సరియా చెప్పారు.

ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ.. ‘బీఎస్‌ఎన్‌ఎల్‌కు అందించిన టెక్నాలజీ మౌలిక సదుపాయాలు నాణ్యత పరంగా పరిశ్రమ బెంచ్‌మార్క్‌లను మించి ఉన్నాయి. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో కంపెనీ ఈ విభాగంలో విస్తరించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ తదుపరి కనెక్టివిటీ కార్యకలాపాల్లోనూ పాల్గొంటాం. బీఎస్‌ఎన్‌ల్‌ 4జీ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా భారత్‌లో మాత్రమే కాకుండా 5జీ, ప్రపంచవ్యాప్తంగా 4జీ కోసం ఇలాంటి సర్వీస్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్టులను చేపట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.

బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఇటీవల దేశవ్యాప్తంగా 4జీ కనెక్టివిటీని అందించేందుకు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో ఇటీవల ప్రధాని చేతుల మీదుగా దేశంలోని అన్ని టవర్ల పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీని ప్రారంభించింది. గత మే నెలలో 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి రూ.2,903.22 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు టీసీఎస్ గతంలో తెలిపింది.

ఇదీ చదవండి: రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 14వేల ఉద్యోగాలు..

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)