Breaking News

టీసీఎస్‌ కొత్త డీల్‌.. ఫిన్‌లాండ్‌ కంపెనీతో..

Published on Fri, 02/14/2025 - 18:19

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(TCS) ఫిన్‌లాండ్‌ సంస్థ యూపీఎమ్‌ (UPM)తో ఐటీ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రీసైక్లబుల్‌ ప్రొడక్టులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన యూపీఎమ్‌ పునరుత్పాదక ఇంధన మెటీరియల్స్‌ను ముడిసరుకులుగా వినియోగిస్తోంది.

11 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ 10.3 బిలియన్‌ యూరోల టర్నోవర్‌ను కలిగి ఉంది. యూపీఎమ్‌ వృద్ధికి డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సహకరించనున్నట్లు ఒప్పందం సందర్భంగా టీసీఎస్‌ పేర్కొంది. తద్వారా ఏఐ ఫస్ట్‌ ఆపరేటింగ్‌ మోడల్‌ను అందిపుచ్చుకోనున్నట్లు తెలియజేసింది. అయితే ఒప్పందం(కాంట్రాక్ట్‌) విలువను వెల్లడించలేదు.

ఇది చదివారా? ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్‌.. ఈసారి అంచనాలు ఇవే..

యూపీఎమ్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఐటీ వేల్యూ చైన్‌ను పటిష్టపరిచే బాటలో ఏఐ ఆధారిత అటానమస్‌ ఎంటర్‌ప్రైజ్‌ ప్లాట్‌ఫామ్‌ ఇగ్నియోను వినియోగించనున్నట్లు టీసీఎస్‌ వెల్లడించింది. అంతేకాకుండా యూపీఎమ్‌కు చెందిన 15,800 మంది ఉద్యోగులు, మెషీన్ల మధ్య మరింత భాగస్వామ్యానికి ఏఐ ద్వారా మద్దతివ్వనుంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.11058 కోట్ల నికర లాభం రాగా ఈసారి 12 శాతం మేర పెరిగడం గమనార్హం. అలాగే సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.11,909 కోట్ల నికర లాభం నమోదు చేసింది. టీసీఎస్ మొత్తం ఆదాయం 5.6 శాతం పెరిగి రూ.63,973 కోట్లకు చేరింది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)