Breaking News

మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం!

Published on Wed, 02/21/2024 - 14:42

భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ 'టీసీఎస్' (TCS) నోయిడాలో సుమారు 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇది ఢిల్లీ - ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో అతిపెద్ద ఆఫీస్ స్పేస్‌లలో ఒకటి కానున్నట్లు సమాచారం. లీజుకు తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం రిటర్న్ టు ఆఫీస్ అని తెలుస్తోంది.

ఇప్పటికే TCS కంపెనీ తమ ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని ఫైనల్ వార్ణింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కంపెనీ ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ స్థలం నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలోని అసోటెక్ బిజినెస్ క్రెస్టెరాలో ఉంది. ఆఫీస్ స్పేస్ అవసరాలకు ఐటీ కంపెనీలు ప్రధాన కారణమని, వర్క్ ఫ్రమ్ హోమ్ ముగింపు వల్ల రాబోయే రోజుల్లో ఆఫీసులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులందరూ ఆఫీసులకు రావడం మొదలుపెడితే.. ఆఫీస్ స్థలాలు ఎక్కువ అవసరమవుతాయి. దీంతో నోయిడా ప్రాంతంలో ఆఫీసులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ జెన్‌పాక్ట్, సెలెబల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు కూడా ఆఫీసు స్థలాలను లీజుకు తీసుకున్నాయి.

ఇదీ చదవండి: మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల!

రిటర్న్ టు ఆఫీస్
TCS కంపెనీలో ఇప్పటికే 65 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు మిగిలిన ఉద్యోగులందరూ కూడా మార్చి ఆఖరినాటికల్లా ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీ డెడ్‌లైన్‌ విధించినట్లు సమాచారం. కంపెనీలో పనిచేసి ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడానికి టీసీఎస్ సిద్ధమైంది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)