Breaking News

రైల్వే తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి..

Published on Wed, 06/11/2025 - 18:55

రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 'ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలి అని రైల్వే శాఖ తన సర్క్యులర్ లో పేర్కొంది.

జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత ఆరు నెలల్లో 2.5 కోట్ల అనుమానాస్పద ఐఆర్‌సీటీసీ ఐడీ (IRCTC ID)లను బ్లాక్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. టికెట్ బుకింగ్ కోసం బాట్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించినందుకు ఆయా ఐడీలను బ్లాక్ చేశారు. ఈ అనధికార ఐడీలను ఏరివేయడానికి వ్యక్తిగత వినియోగదారులకు తత్కాల్ ఈ-టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్‌కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఏజెంట్లకు షాక్‌..
దీంతో పాటు ఆథరైజ్డ్  ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. అంటే ఏసీ తరగతులకు 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు 11.30 గంటల తర్వాత మాత్రమే ఏజెంట్లకు టికెట్ బుకింగ్‌కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్‌సీటీసీ తమ సిస్టమ్స్ లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్‌లను నిలిపివేయడానికి గానూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

👉ఇదీ చదవండి: వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)