రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!
Breaking News
మరో ఐదేళ్లు.. ఆయనే టాటా సన్స్ ఛైర్మన్!
Published on Thu, 09/17/2026 - 15:25
టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ విషయంలో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. తన పదవీకాలం 2027 ఫిబ్రవరి 20న ముగిసిన తర్వాత మరోసారి ఛైర్మన్‌గా కొనసాగాలని తాను కోరుకోవడం లేదని చంద్రశేఖరన్ గతంలోనే ప్రకటించారు. టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల వృత్తి జీవితాన్ని పూర్తి చేశానని, ఈ సంస్థకు సేవ చేసే అవకాశం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.
అయితే తాజాగా.. జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలం ఇవ్వడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేయగా, మిగిలిన బోర్డు సభ్యులందరూ అనుకూలంగా ఓటు వేశారు.
స్టాక్ మార్కెట్లో లిస్టింగ్
ఈ మొత్తం వ్యవహారంలో మరో పెద్ద అంశం.. టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలా లేదా అన్నది. టాటా సన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఒక అప్పర్ లేయర్ NBFCగా వర్గీకరించిన నేపథ్యంలో, సెప్టెంబర్ 11న దాని NBFC రిజిస్ట్రేషన్‌ను వదులుకోవడానికి చేసిన దరఖాస్తును RBI తిరస్కరించింది. దీంతో టాటా సన్స్‌ను భవిష్యత్తులో మార్కెట్లో లిస్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం పెరిగింది. ఈ లిస్టింగ్ అంశంపై టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ బోర్డు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు గతంలో నివేదికలు వచ్చాయి. అందుకే తాజా బోర్డు సమావేశం ఛైర్మన్ పదవితో పాటు టాటా సన్స్ భవిష్యత్ దిశకు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రశేఖరన్ మొదట పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. టాటా ట్రస్ట్ కూడా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ కొత్త ఛైర్మన్ ఎంపికపై దృష్టి పెట్టింది. కానీ తాజాగా.. జరిగిన బోర్డు సమావేశంలో పరిస్థితి మారి, ఆయనకు మరో ఐదేళ్ల ఆమోదించబడినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే చంద్రశేఖరన్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!
Tags : 1