Breaking News

రూ.9000 కోట్ల పెట్టుబడి.. 5000 ఉద్యోగాలు: టాటా మోటార్స్

Published on Sat, 09/28/2024 - 16:15

టాటా మోటార్స్ తమిళనాడులోని రాణిపేటలో సరికొత్త తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సదుపాయంలో  టాటా మోటార్స్, జేఎల్ఆర్ రెండింటికీ వాహనాలను తయారు చేస్తుంది. ఇక్కడ తయారయ్యే వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా.. విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సమాచారం. శంకుస్థాపన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టాటాకు చెందిన సీనియర్ ప్రతినిధులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

2024 మార్చిలో టాటా మోటార్స్ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. కంపెనీ నిర్మించనున్న కొత్త ప్లాంట్‌లో ఐదు సంవత్సరాల వ్యవధిలో మొత్తం రూ.9,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. నిర్మాణం పూర్తయిన తరువాత రాష్ట్రంలో సుమారు 5000 ఉద్యోగాలు లభించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?

ఈ సందర్భంగా టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్‌, లగ్జరీ వాహనాలతో సహా మా తర్వాతి తరం కార్లు, ఎస్‌యూవీలకు త్వరలో పూర్తికానున్న ప్లాంట్ నిలయంగా మారుతుంది. తమిళనాడు ప్రగతిశీల విధానాలతో ప్రముఖ పారిశ్రామిక రాష్ట్రంగా ఉంది. అనేక టాటా గ్రూప్ కంపెనీలు ఇక్కడ నుండి విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ.. వివిధ స్థాయిల్లో మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)