దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం: భారీగా పెరగనున్న ధరలు

Published on Tue, 12/10/2024 - 14:28

మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ఇప్పటికే తమ బ్రాండ్ వాహనాల ధరలను 2025 జనవరి ప్రారంభం నుంచే పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కూడా చేరింది.

టాటా మోటార్స్ తన మోడల్స్ ధరలను 3 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కొత్త ధరలు 2025 జనవరి నుంచే అమలులోకి వస్తాయి. కానీ ఏ వేరియంట్ ధర ఎంత అనేది త్వరలోనే వెల్లడవుతుంది. ఫ్యూయెల్ వాహనాలు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగానే ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ స్పష్టం చేసింది. కాగా కంపెనీ వచ్చే ఏడాదిలో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా కొత్త ఉత్పత్తులు కనువిందు చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారు

వాహన తయారీ సంస్థలు ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి ఏటా.. ఏడాది చివరలో లేదా పండుగ సీజన్లలో ధరలను పెంచుతాయి. ఇప్పుడు కూడా ఇదే విధానం అనుసరించి.. పలు కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా?.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.
 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)