Breaking News

టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఆఫర్లు

Published on Sun, 06/07/2026 - 13:46

దేశీయ వాహన దిగ్గజం టాటా మోటర్స్‌ (Tata Motors) ఈ జూన్‌ నెలలో తమ ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలను మరింత పెంచుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై గ్రీన్‌ బోనస్‌లు, ఎక్స్చేంజ్‌ బెనిఫిట్లు, స్క్రాపేజ్‌ ప్రోత్సాహకాలు, లాయల్టీ బోనస్‌ల రూపంలో మొత్తం రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ముఖ్యంగా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ మోడళ్లపై అత్యధిక తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి.

కర్వ్ ఈవీపై అత్యధిక బెనిఫిట్లు

Tata Curvv EV Discount: టాటా కర్వ్ ఈవీ ఎంపిక చేసిన నాన్-ఎక్స్‌ వేరియంట్లపై మొత్తం రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.3 లక్షల గ్రీన్‌ బోనస్‌తో పాటు రూ.30,000 ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌ లేదా రూ.35,000 స్క్రాపేజ్‌ బెనిఫిట్‌ ఉంటుంది. క్రియేటివ్‌ వేరియంట్లపై రూ.2.85 లక్షల వరకు ప్రయోజనాలు ఉండగా, ఎక్స్‌ సిరీస్‌ వేరియంట్లకు ఎక్స్చేంజ్‌, స్క్రాపేజ్‌, లాయల్టీ బోనస్‌ల రూపంలో రూ.65,000 వరకు లభించనున్నాయి.

హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల వరకు..

Tata Harrier EV Offers: టాటా హారియర్ ఈవీ అన్ని వేరియంట్లపై రూ.2.75 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో రూ.50,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌, రూ.75,000 స్క్రాపేజ్‌ బెనిఫిట్‌, రూ.1 లక్ష లాయల్టీ బోనస్‌తో పాటు అదనంగా మరో రూ.1 లక్ష ప్రయోజనం ఉంది. దీంతో హారియర్ ఈవీ కొనుగోలుదారులకు గణనీయమైన ఆదా అవకాశం కలుగుతోంది.

పంచ్ ఈవీ, టియాగో ఈవీపైనా భారీ తగ్గింపులు

Tata Punch EV Discount: అవుట్‌గోయింగ్‌ పంచ్‌ ఈవీ వేరియంట్లపై రూ.95 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లాంగ్‌ రేంజ్‌ (LR) వేరియంట్లకు గరిష్ఠంగా రూ.1.45 లక్షలు, మీడియం రేంజ్‌ (MR) వేరియంట్లకు రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

Tata Nexon EV Offers: అలాగే అవుట్‌గోయింగ్‌ టియాగో ఈవీపై రూ.65 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు ప్రకటించారు. LR XT వేరియంట్‌కు అత్యధికంగా రూ.1.45 లక్షల వరకు ఆఫర్‌ ఉండగా, ఇతర LR వేరియంట్లకు రూ.1.25 లక్షలు, MR వేరియంట్లకు రూ.65 వేల వరకు ప్రయోజనాలు అందుతున్నాయి.

నెక్సాన్ ఈవీపై రూ.50 వేల వరకు..

టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) సిరీస్‌పై మొత్తం రూ.50 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.15 వేల గ్రీన్‌ బోనస్‌, రూ.25 వేల ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌, రూ.35 వేల స్క్రాపేజ్‌ బెనిఫిట్‌ ఉన్నాయి. అయితే ఎక్స్చేంజ్‌, స్క్రాపేజ్‌ ఆఫర్లను ఒకేసారి పొందే అవకాశం లేదు.

ఎందుకు ఇంత భారీ ఆఫర్లు?

భారత ఈవీ మార్కెట్లో పోటీ పెరుగుతుండటం, కొత్త మోడళ్ల రాక, కొన్ని పాత స్టాక్‌లను క్లియర్‌ చేయాల్సిన అవసరం నేపథ్యంలో టాటా మోటార్స్‌ ఈ భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అవుట్‌గోయింగ్‌ పంచ్‌ ఈవీ, టియాగో ఈవీ వేరియంట్లపై అధిక తగ్గింపులు ఇందుకు సంకేతంగా భావిస్తున్నారు.

ఈ ఆఫర్లు నగరం, డీలర్‌ స్టాక్‌ లభ్యత, వాహనం తయారీ సంవత్సరం (Model Year), వినియోగదారుడి అర్హత వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. కాబట్టి కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు సమీప టాటా డీలర్‌షిప్‌ను సంప్రదించి తాజా వివరాలు తెలుసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.

ఇదీ చదవండి: హ్యుందాయ్ కార్లపై ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)