Breaking News

టాటా కంపెనీకి షోకాజ్‌ నోటీసులు

Published on Thu, 10/17/2024 - 09:09

ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ హెల్త్ అండ్ సేఫ్టీ (డీఐఎస్‌హెచ్‌) టాటా ఎలక్ట్రానిక్స్‌కు షోకాజ్‌ నోటీసు అందజేసింది. గత నెల 28న తమిళనాడులోని టాటా యూనిట్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి వివరణ ఇవ్వాలని డీఐఎస్‌హెచ్‌ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై కంపెనీ ప్రతినిధులు వారంలోపు స్పందించాలని తెలిపింది.

ఫ్యాక్టరీల చట్టం ప్రకారం..ఫ్యాక్టరీ వ్యవహారాలపై అంతిమ అధికారం కలిగి ఉన్న వ్యక్తి కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టప్రకారం ఆ వ్యక్తిని ‘ఆక్యుపైయర్‌’గా పరిగణిస్తారు. కంపెనీ డైరెక్టర్లు లేదా సంస్థ ప్రతిపాదించిన వ్యక్తి ఈ హోదాలో ఉండవచ్చు. కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆక్యుపైయర్‌ తెలియజేయాల్సి ఉంటుంది. ప్రమాదానికిగల కారణాలు చెప్పాలి. ఎక్కడ తప్పు జరిగిందో వివరించడానికి కంపెనీకి ఒక అవకాశం కల్పించడం కోసం ఇలా ఈ షోకాజు నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..

ఇప్పటికే డీఐఎస్‌ఎహెచ్‌ ప్రమాదానికిగల కారణాలను అంచనా వేసిందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. తమిళనాడు హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్‌కు చెందిన యానోడైజింగ్‌ ప్లాంట్‌లో థర్మోస్టాట్ నియంత్రణ వైఫల్యం కారణంగా మంటలు చెలరేగాయని కంపెనీ అధికారులు చెప్పారు. ఈ యూనిట్‌లో యాపిల్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కంపెనీ ఇదివరకే ప్రకటించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)