Breaking News

ఐపీఓగా టాటా గ్రూప్‌ కంపెనీ

Published on Wed, 08/06/2025 - 09:11

టాటా గ్రూప్‌ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం టాటా క్యాపిటల్‌ పబ్లిక్‌ ఇష్యూ బాటలో మరో ముందడుగు వేసింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. తద్వారా 200 కోట్ల డాలర్లు(రూ.17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి కంపెనీ విలువ 11 బిలియన్‌ డాలర్లు(రూ.94,600 కోట్లు)గా మదింపు చేశాయి.

ప్రాస్పెక్టస్‌ ప్రకారం కంపెనీ మొత్తం 47.58 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. 26.58 కోట్ల షేర్లను కంపెనీ ప్రధాన ప్రమోటర్‌ టాటా సన్స్, ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఎఫ్‌సీ) ఆఫర్‌ చేయనున్నాయి. టాటా సన్స్‌ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు విక్రయించనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్‌ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీకి 1.8 శాతం వాటా ఉంది. ఇష్యూ నిధులను భవిష్యత్‌ అవసరాలరీత్యా టైర్‌–1 క్యాపిటల్‌ పటిష్టతకు వినియోగించనుంది. 

ఇదీ చదవండి: ఆస్తిలో అంబానీనే మించిన 20 ఏళ్ల యువకుడు

కంపెనీ ఇప్పటికే ఏప్రిల్‌లో గోప్యతా విధానంలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జులైలో దీనికి అనుమతి లభించడంతో తుది ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసేలోగా అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయవలసి ఉంది. దీంతో తాజాగా సెబీకి అప్‌డేటెడ్‌ పత్రాలను దాఖలు చేసింది. వెరసి 2023 నవంబర్‌లో టాటా గ్రూప్‌ ఐటీ దిగ్గజం టాటా టెక్నాలజీస్‌ లిస్ట్‌ అయ్యాక తిరిగి మరో దిగ్గజం పబ్లిక్‌ ఇష్యూకి రానుంది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)