Breaking News

డబ్బులు దాచుకునే పిగ్గీ బ్యాంక్‌ ఎప్పుడు పుట్టిందో తెలుసా?

Published on Sat, 08/30/2025 - 09:20

పిల్లలూ... మీరంతా డబ్బులను భద్రంగా దాచుకునేందుకు  పిగ్గీ బ్యాంక్‌ను ఉపయోగిస్తుంటారు కదూ. పెద్దలు అప్పుడప్పుడూ ఇచ్చిన డబ్బుల్ని ఇందులో దాచుకొని, అది నిండాక పగలగొట్టి వాడుకుంటారు కదూ. వరాహం ఆకారంలో ఉండే ఈ పిగ్గీ బ్యాంక్‌ వాడేందుకే కాదు, చూసేందుకూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఇంట్లో అలంకరణ వస్తువుగానూ పెట్టుకుంటారు.

ఇలా డబ్బు దాచుకునే సాధనాలను వాడే అలవాటు క్రీ.పూ 2వ శతాబ్దంలో మొదలైందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు ఆ కాలంలో వారు డబ్బులు దాచే పెట్టెలు, హుండీలు బయటపడ్డాయి. వాటిని వివిధ రకాల లోహాలతో తయారు చేశారు. అయితే వరాహ ఆకారంలో ఇలాంటివి తయారు చేయడం మాత్రం క్రీ,శ, 12వ శతాబ్దంలో మొదలైందని అంటారు.

వరాహ ఆకారంలో ఉన్న ఈ హుండీలు జావా ద్వీపంలో మొట్టమొదటిసారి దొరికినట్లు చెబుతున్నారు. ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో పెద్ద సంఖ్యలో వరాహ ఆకారపు పిగ్గీ బ్యాంకులు కనుగొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆకారంలోని పిగ్గీ బ్యాంకులు 13వ శతాబ్దంలో జర్మనీలో తయారయ్యాయని అంటున్నారు. అక్కడ పందులను అదృష్టానికి చిహ్నాలుగా గౌరవించేవారని, అందుకే పంది ఆకారంలో వాటిని తయారు చేసేవారని భావిస్తున్నారు.

ఈ పిగ్గీ బ్యాంక్‌లు సిరామిక్‌ లేదా పింగాణీతో తయారు చేస్తారు. వివిధ సైజులు, ఆకారాలతో ఇవి లభ్యమవుతాయి. విదేశాల్లో పిల్లలకు పుట్టినరోజు బహుమతులుగా వీటిని ఇచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. పిల్లల్లో పొదుపు ఆలోచన పెంచేందుకు కొన్ని విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ పిగ్గీ బ్యాంకులను వారికి ఉచితంగా అందిస్తుంటాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)