Breaking News

భారత్‌ను అధిగమించిన తైవాన్!

Published on Tue, 05/26/2026 - 18:54

గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కంటే తక్కువ జనాభా కలిగిన తైవాన్, భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా నిలిచింది. తైవాన్ మార్కెట్ విలువ సుమారు 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ డేటా వెల్లడించింది.

తైవాన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్. ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) అనే చిప్ తయారీ సంస్థ భారీ వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది 49% వరకు పెరగడం వల్ల తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది.

టీఎస్ఎంసీ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థగా.. ఎన్విడియా, ఆపిల్, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్, క్వాల్‌కామ్ ఉపయోగించే అధునాతన చిప్‌లను తయారు చేసి సరఫరా చేస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు ఏఐ, సెమీకండక్టర్ రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ.. తైవాన్ మార్కెట్‌లోకి పెద్ద మొత్తంలో నిధులు తరలిస్తున్నారు. ఫలితంగా తైవాన్ మార్కెట్ వేగంగా ఎదిగింది.

అయితే.. ప్రస్తుతం భారత్ పరిస్థితి భిన్నంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, రూపాయి విలువ తగ్గడం, కార్పొరేట్ లాభాల మందగింపు వంటి కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు.. భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారు. అంతే కాకుండా గ్లోబల్ ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో భారత్‌కు ఇంకా పెద్ద స్థాయిలో లిస్టెడ్ కంపెనీలు లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశానికి పెద్ద ఆర్థిక వ్యవస్థ, 140 కోట్లకుపైగా జనాభా, వేల సంఖ్యలో లిస్టెడ్ కంపెనీలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటల్ ఎక్కువగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెట్లవైపు వెళ్తోంది. కానీ ఇప్పుడు తైవాన్.. భారత్‌ను అధిగమించడం అనేది ఇండియాకు పెద్ద నష్టం కాదు. ఈ సమయంలో కూడా దేశీయ పెట్టుబడిదారుల బలం, SIPలు, రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో భారత మార్కెట్ స్థిరంగా కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు.

Videos

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను

ఆకాశం నుంచి నిప్పుల వాన

నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?

బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్

సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

పినరయి విజయన్ నివాసం వద్ద ED టీం పై CPM దాడి

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం జోసెఫ్ విజయ్

పోలీస్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన సాక్షి రిపోర్టర్

భారత కంపెనీల లాభాలకు రిస్క్ ఆందోళనలో పారిశ్రామికవేత్తలు

ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి

Photos

+5

వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు)

+5

హీరో ఉపేంద్ర ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు)

+5

మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్

+5

విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)