Breaking News

75 దేశాల్లో కోటి మంది కొన్నారు: ధర కూడా తక్కువే..

Published on Fri, 08/08/2025 - 11:34

సుజుకి మోటార్ కార్పొరేషన్.. 'వ్యాగన్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా 1 కోటి అమ్మకాలు దాటిందని ప్రకటించింది. ఈ కారు 1999లో భారతదేశంలో అడుగుపెట్టడానికి ముందే.. జపాన్, యూరప్ వంటి మార్కెట్లలో మంచి అమ్మకాలను పొందింది.

1993 సెప్టెంబర్‌లో జపాన్‌లో వ్యాగన్ ఆర్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది సెమీ బోనెట్ స్టైల్ పొందింది. దీని పరిమాణం, డిజైన్ కారణంగానే అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. జపాన్ తరువాత భారతదేశం (1999), హంగేరీ (2000), ఇండోనేషియా (2013), పాకిస్తాన్ (2014)లలో వ్యాగన్ ఆర్ ఉత్పత్తి మొదలైంది. ప్రస్తుతం ఈ కారును కంపెనీ సుమారు 75 కంటే ఎక్కువ దేశాల్లో విక్రయిస్తోంది.

1998 అక్టోబర్ నాటికి 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్న వ్యాగన్ ఆర్.. 2010 ఫిబ్రవరి నాటికి 50 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. 2022 జనవరి నాటికి 90 లక్షలు, 2025 జూన్ నాటికి ఒక కోటి యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకోగలిగింది.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్: రూ.10 లక్షల తగ్గింపు!

భారతదేశంలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 1.0 లీటర్, త్రీ సిలిండర్, 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో మాత్రమే కాకుండా.. CNG ఎంపికలో కూడా లభిస్తోంది. ఈ కారు ధరలు రూ. 5.78 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)