Breaking News

సుజుకి ఈ-యాక్సెస్ vs హోండా యాక్టివా ఈ: రేంజ్ & ధరలు

Published on Sat, 05/31/2025 - 19:38

సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఈ-యాక్సెస్'ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత  హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కథనంలో ఈ రెండు స్కూటర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.

స్పెసిఫికేషన్స్
రెండు స్కూటర్లు ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కూటర్లు. కాబట్టి ఇవి చాలా సింపుల్ డిజైన్ పొందుతాయి. యాక్టివా ఈ స్కూటర్ 6 కిలోవాట్ మోటార్ మోటారుతో శక్తినిస్తుంది. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీలు రెండు ఉంటాయి. ఇవి ఒక సింగిల్ ఛార్జితో 102 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం.

సుజుకి ఈ యాక్సెస్ విషయానికి వస్తే.. ఇందులో 3.072 కిలోవాట్ లిథియం ఫాస్పెట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 95 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 4.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 15 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 71 కిమీ/గం.

ఫీచర్స్
సుజుకి ఈ యాక్సెస్ స్కూటర్.. ఎల్ఈడీ లైటింగ్, రెండు చివర్లలో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 765 మిమీ ఎత్తైన సీటు, 122 కేజీల బరువు ఉంటుంది. ఈ స్కూటర్ ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. బ్లూటూత్/యాప్ కనెక్టివిటీతో పాటు 4.2 ఇంచెస్ TFT LCD కన్సోల్, మూడు రైడింగ్ మోడ్‌లు, USB ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి కూడా ఇందులో ఉన్నాయి.

హోండా యాక్టివా ఈ స్కూటర్ విషయానికి వస్తే.. ఇందులో 7 ఇంచెస్ TFT స్క్రీన్‌తో పాటు ఆప్షనల్ హోండా రోడ్ సింక్ యాప్ కనెక్టివిటీ, మూడు రైడింగ్ మోడ్‌లు, రివర్స్ మోడ్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్‌ మొదలైనవి ఉన్నాయి.

ఛార్జింగ్ డీటైల్స్
ఛార్జింగ్ విషయంలో మాత్రం రెండు స్కూటర్లు భిన్నంగా ఉంటాయి. పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించి, సుజుకి ఇ-యాక్సెస్‌ను 4 గంటల 30 నిమిషాల్లో 80 శాతం, 6 గంటల 42 నిమిషాల్లో 100 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 1 గంట 12 నిమిషాల్లో 80 శాతం & 2 గంటల 12 నిమిషాల్లో పూర్తి ఛార్జ్‌ అవుతుంది. 

ఇదీ చదవండి: జర్మన్ బ్రాండ్‌తో చేతులు కలిపిన నీరజ్ చోప్రా

'హోండా యాక్టివా ఈ'లో బ్యాటరీని సబ్‌స్క్రిప్షన్‌గా అందిస్తుంది. దీనికి ఛార్జ్ చేయదగిన బ్యాటరీలు లేవు కాబట్టి, మార్చుకోగల బ్యాటరీలు మాత్రమే ఉంటాయి. ప్రాథమిక ప్లాన్ నెలవారీ అద్దె రూ. 1,999 + GSTతో వస్తుంది, దీని ద్వారా 35 kWh ఎనర్జీ లభిస్తుంది. ఈ స్కూటర్ రోజుకు 40 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరం ప్రయాణించే రైడర్‌లకు ఉపయోగకరంగా ఉంటుంది.

ధరలు
హోండా యాక్టివా ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, రోడ్ సింక్. వీటి ధరలు వరుసగా రూ. 1.17 లక్షలు, రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ.. సుజుకి ఈ-యాక్సెస్ ధరలు ఇంకా వెల్లడించలేదు.అయితే దీని ధర రూ. 1.0 నుంచి రూ. 1.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)