Breaking News

Delhi: బైక్‌ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్‌!

Published on Mon, 06/12/2023 - 15:48

రైడ్‌ షేరింగ్‌ సంస్థలకు సుప్రీం కోర్ట్‌ భారీ షాకిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించే వరకు ఢిల్లీలో ద‍్విచక్రవాహనాలు నడపకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30 నాటికి టూవీలర్‌ నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను నడిపేలా నూతన విధానాన్ని తీసుకువస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అప్పటి వరకు దేశ రాజధానిలో టూవీలర్‌ ట్యాక్సీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లైంది. 

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థల్ని ఉద్దేశిస్తూ కీలక నోటీసులు జారీ చేసింది. అందులో వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్‌ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. 

అంతేకాదు ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన సంస్థలకు మొదటి నేరం కింద రూ. 5,000, రెండవసారి తప్పు చేస్తే రూ. 10,000 జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని రవాణా శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు రైడింగ్‌ సర్వీసులు అందించే వాహన యజమాని (డ్రైవర్) డ్రైవింగ్‌  లైసెన్స్‌ 3 నెలల పాటు రద్దు అవుతుందని తెలిపింది. 

అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైడ్‌ షేరింగ్‌ సంస్థకు షోకాజు నోటీసులు అందించింది. ఆ నోటీసులపై స్పందించిన సదరు సంస్థ తమకు అందిన నోటీసులు వివిధ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైడ్‌ షేరింగ్‌ టూ వీలర్‌ వాహనాల కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వడం రైడ్‌ షేరింగ్‌ సంస్థలకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది.

చదవండి👉 యాపిల్‌ కంపెనీలో రూ. 138 కోట్ల ఘరానా మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష!

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి