Breaking News

ముకేశ్ అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ భద్రత.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Published on Wed, 03/01/2023 - 14:31

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు జెడ్‌ ప్లస్‌ (z plus security) భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం దేశంలోనే ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారికి భద్రత కల్పిస్తుందని తెలిపింది.

విదేశాలకు వెళ్లినప్పుడు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారికి భద్రతా ఏర్పాట్లు చేయాలని కోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాలతో ముఖేష్‌ అంబానీ కుటుంబానికి భారత్‌తో పాటు ఇతర దేశాల్లో సైతం జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహించే కమాండోలు వారికి రక్షణగా నిలవనున్నారు. అయితే అత్యంత ఖరీదైన జెడ్‌ ప్లస్‌ కేటగిరీకి అయ్యే ఖర్చు ముఖేష్‌ అంబానీయే భరించాలని సుప్రీం కోర్టు కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

జెడ్‌ ప్లస్‌ భద్రత ఎందుకు?
ఇటీవల కాలంలో ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్‌ ఎక్కువయ్యాయి. దీంతో భద్రత దృష్ట్యా కేంద్రం అంబానీలకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించింది. అయితే వీరికి భద్రత కల్పించడంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ హైకోర్టుల్లో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో..ఒక వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పుడు..ఆయనకు కల్పించే భద్రతను ప్రాంతానికి లేదా నగరానికి పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. ముకేశ్ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు మన దేశంలోనూ, విదేశాల్లోనూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనికోసం అయ్యే ఖర్చులను అంబానీలే భరించాలని స్పష్టం చేసింది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి