Breaking News

అనిల్‌ అంబానీ అదృష్టం తారుమారు

Published on Thu, 04/11/2024 - 01:37

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నులకు సంబంధించి 2008లో వెలువడిన జాబితాలో ఆరవస్థానంలో నిలిచిన అనిల్‌ అంబానీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థల్లో ఒకటైన–  ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు(డీఏఎంఈపీఎల్‌) అనుకూలంగా గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్‌ అవార్డును సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది.

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ సంస్థ– డీఏఎంఈపీఎల్‌ అలాగే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) మధ్య కుదిరిన ‘‘రాయితీ ఒప్పందం’’ విషయంలో తలెత్తిన ఒక వివాదానికి సంబంధించి రూ.8,000 కోట్ల అవార్డుతో ఆయన కష్టాలు కొంత గట్టెక్కుతాయన్న అంచనాలను తాజా పరిణామం దెబ్బతీసింది. ఆర్బిట్రేషన్‌ అనుగుణంగా గతంలో డీఎంఆర్‌సీ చెల్లించిన రూ.3,300 కోట్లను వాపసు చేయాలని సుప్రీం డీఏఎంఈపీఎల్‌ని ఆదేశించింది. అయితే తీర్పు వల్ల తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని  రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేర్కొంది. అటు డీఎంఆర్‌సీ నుంచి కానీ ఇటు గ్రూప్‌ సంస్థ  డీఏఎంఈపీఎల్‌ నుంచి తనకు ఎటువంటి డబ్బూ అందలేదని వివరించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)