Breaking News

అందరికీ అనుకూలంగా ఫండ్స్‌ కొత్త నిబంధనలు

Published on Fri, 12/19/2025 - 08:40

మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు సంబంధించి సెబీ సవరించిన నిబంధనలు సమతుల్యంగా ఉన్నాయని, ఇన్వెస్టర్లతోపాటు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నట్టు అయిందని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫ్‌ ఇండియా (యాంఫి) చైర్మన్‌ సందీప్‌సిక్కా తెలిపారు. కొత్త నిబంధనలతో ఫండ్స్‌ పరిశ్రమకు సైతం స్పష్టత ఏర్పడినట్టు చెప్పారు.

మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లు చెల్లిస్తున్న ఫీజుల్లో మార్పులు ప్రతిపాదిస్తూ కొత్త కార్యాచరణను సెబీ బుధవారం ప్రకటించడం తెలిసిందే. ఏడేళ్ల నుంచి ఫండ్స్‌ సంస్థలు పెట్టుబడిదారుల నుంచి 0.05 శాతం అదనంగా వసూలు చేస్తున్న ఎగ్జిట్‌ లోడ్‌ నిబంధనకు ముగింపు పలకడం గమనార్హం. ఫండ్స్‌ సంస్థల నుంచి ఈక్విటీ పెట్టుబడులపై బ్రోకరేజీ సంస్థలు వసూలు చేస్తున్న చార్జీల గరిష్ట పరిమితిని 0.12 శాతం నుంచి 0.06 శాతానికి, డెరివేటివ్స్‌ చార్జీని 0.05 శాతం నుంచి 0.01 శాతానికి తగ్గించింది.

ఈ ఏడాది ఆరంభంలో ఫండ్స్‌కు సంబంధించి సెబీ ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. అయితే, భాగస్వాముల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, తుది నిబంధనలను ఖరారు చేసినట్టు సెబీ చైర్మన్‌ తుహిన్‌కాంత పాండే చెప్పారు. దీంతో ఆరంభంలో అంత కఠినంగా తుది నిబంధనల్లేవన్నారు. సెబీ కొత్త నిబంధనలతో స్పష్టత ఏర్పడి, దేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ మరింత విస్తరించేందుకు అనుకూలిస్తుందని సిక్కా అభిప్రాయపడ్డారు. సెబీ నిర్ణయాల నేపథ్యంలో గురువారం అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఎంసీ) కంపెనీల షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ర్యాలీ చేశాయి.

ఇదీ చదవండి: భారత్‌లో చాట్‌జీపీటీ, పర్‌ప్లెక్సిటీ జోరు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)