Breaking News

‘అడ్డంకులు తొలిగాయి.. లెజెండ్స్‌ పుట్టారు’

Published on Mon, 11/03/2025 - 13:13

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల సమక్షంలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా క్రికెట్‌ జట్టు, దక్షిణాఫ్రికా జట్టుపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో భారత్‌ మొదటిసారి ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టెక్ పరిశ్రమ దిగ్గజాలు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోషల్ మీడియా వేదికగా ఇండియా జట్టును అభినందించారు.

భారతదేశం ప్రతిష్టాత్మక క్రికెట్ విజయాలను గుర్తుచేస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ఫైనల్‌ను ఉత్కంఠభరితమైన మ్యాచ్‌గా అభివర్ణించారు. ‘భారత క్రికెట్‌ మహిళల జట్టుకు అభినందనలు. ఈ విజయంతో 1983, 2011నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ విజయం మొత్తం తరానికి స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా టీమ్‌కు కూడా ఇదో గొప్ప టోర్నమెంట్’ అని తన ఎక్స్‌ ఖాతాలో టీమ్‌ ఇండియాను అభినందించారు.

'Barriers broken, legends born': Sundar Pichai, Satya Nadella hail India's historic Women's World Cup triumph

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ఈ విజయంపై స్పందిస్తూ..‘ఉమెన్ ఇన్ బ్లూ = ప్రపంచ ఛాంపియన్లు! మహిళల క్రికెట్‌కు నిజంగా చారిత్రక రోజు. కొత్త అధ్యాయాలు లిఖించారు. అడ్డంకులు తొలిగాయి. లెజెండ్స్ పుట్టుకొచ్చారు. ఈ ఫార్మాట్‌‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికాకు ప్రశంసలు’ అని రాసుకొచ్చారు.

'Barriers broken, legends born': Sundar Pichai, Satya Nadella hail India's historic Women's World Cup triumph

ఇదీ చదవండి: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌పై ఈడీ చర్య

Videos

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు