Breaking News

గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్‌గానా.. ఫోటో వైరల్!

Published on Tue, 09/26/2023 - 18:03

భారతదేశం నుంచి వెళ్లి ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎక్కువ జీతం తీసుకునే సీఈఓల జాబితాలో ఒకడైన ఈయన చాలా ఆడంబరంగా ఉంటారని చాలామంది ఊహించి ఉంటారు. కానీ తాజాగా విడుదలైన ఫోటో మీ ఆలోచనలను తారుమారు చేస్తుంది. మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

బెంగళూరుకు చెందిన 'సిద్ పురి' ఇటీవలే శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడ ఉదయం వాకింగ్ చేసే సమయంలో సుందర్ పిచాయ్ పెద్దగా సెక్యూరిటీ లేకుండానే కనిపించారు. అప్పుడు సిద్ ఫోటో తీసుకోవచ్చా.. అని అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. ఈ ఫోటోలు ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసాడు.

ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!

ఈ ఫోటోలలో గమించినట్లతే.. సుందర్ పిచాయ్ చాలా సింపుల్‌గా బ్లూ జీన్స్, జాకెట్, బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోని ఇప్పటికి 6 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించారు. 4000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్‌ఆర్‌పీ కంటే ఎక్కువ ధరతో..

ఒక నెటిజన్ అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరా? అని అడిగాడు. దీనికి ఒక్క సెక్యూరిటీ ఉన్నాడు, అతడే ఫోటో తీసాడని సిద్ రిప్లై ఇచ్చాడు. మరి కొందరు అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా చాలా సాధారణంగా ఉండటం చూస్తే.. చాలా ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట తిరగటం కొంత ఆందోళన కలిగిస్తుందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)