Breaking News

ఐఎస్‌ఎంఏ అధ్యక్షుడిగా మండవ ప్రభాకర్‌ రావు

Published on Thu, 12/28/2023 - 07:22

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇండియన్‌ షుగర్‌ అండ్‌ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) కొత్త అధ్యక్షుడిగా నూజివీడు సీడ్స్‌ (ఎన్‌ఎస్‌ఎల్‌), ఎన్‌ఎస్‌ఎల్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ సంస్థల చైర్మన్‌ మండవ ప్రభాకర్‌ రావు ఎన్నికయ్యారు. ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

న్యూఢిల్లీలో జరిగిన 89వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ పేరును ఇండియన్‌ షుగర్‌ అండ్‌ బయో ఎనర్జీ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ)గా మార్చారు. సంస్థ ఉపాధ్యక్షుడిగా ధామ్‌పూర్‌ బయో ఆర్గానిక్స్‌ (డీబీవో) ఎండీ గౌతమ్‌ గోయల్‌ను ఎన్నుకున్నారు.

దేశీయంగా జీవ ఇంధనాలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో దూరదృష్టితో తమ సంస్థ పేరులో బయో ఎనర్జీని కూడా చేర్చినట్లు ఐఎస్‌ఎంఏ తెలిపింది. దేశీయంగా చక్కెర పరిశ్రమ.. ఇంధన పరిశ్రమగా రూపాంతరం చెంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా తెలిపారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)