Breaking News

ఎలాన్‌ మస్క్‌కు భారీ ఝలక్‌!

Published on Sun, 09/03/2023 - 13:01

ఎక్స్‌. కామ్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కు హ్యాకర్లు ఝలక్‌ ఇచ్చారు. తమ దేశంలోనూ స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించాలని వార్నింగ్‌ ఇస్తూ సూడాన్‌కు చెందిన యాకర్లు ఎక్స్‌. కామ్‌ను హ్యాక్‌ చేశారు. ఆపై సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ పనిచేయకుండా బ్లాక్‌ చేశారు. 

సుడాన్‌లోని ఓ రహస్య హ్యాకర్స్‌ బృందం ప్రపంచంలోని 12కు పైగా దేశాల్లో ఎక్స్‌. కామ్‌ పని చేయకుండా 2 గంటల పాటు నిలిపివేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మైక్రో బ్లాగింగ్‌ సైట్‌లో తలెత్తిన అంతరాయంతో యూజర్లు ఇబ్బంది పడినట్లు బ్రిటిష్‌ మీడియా సంస్థ బీబీసీ నివేదించింది.  

‘ఎలాన్‌ మస్క్‌కు మేమిచ్చే మెసేజ్‌ ఇదే. సూడాన్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించాలంటూ హ్యాకర్స్‌ గ్రూప్‌ టెలిగ్రాం ఛానల్‌లో ఓ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది.ఎక్స్‌. కామ్‌ను తమ అదుపులోకి తీసుకోవడంతో యూకే, యూఎస్‌కు చెందిన 20,000 మంది తమకు ఫిర్యాదు చేసినట్లు డౌన్‌ డిటిటెక్టర్‌ తెలిపింది. 

ఎక్స్‌.కామ్‌ హ్యాకింగ్‌కు కారణం
అయితే, జరిగిన అంతరాయాన్ని ఎక్స్‌.కామ్‌ యాజమాన్యం స్పందించలేదు. ఈ సందర్భంగా హ్యాకింగ్‌ గ్రూప్‌ సభ్యుడు హోఫా మాట్లాడుతూ.. సూడాన్‌లో కొనసాగుతున్న సివిల్‌ వార్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో  డిస్ట్రిబ్యూటెడ్ డెనిషన్ ఆఫ్ సర్వీస్ (డీడీఓఎస్) హ్యాకింగ్‌ దాడి జరిగింది. కానీ ఇంటర్నెట్‌ పనితీరు కారణంగా మా నినాదాన్ని గట్టిగా వినిపించ లేకపోతున్నాం. తరచుగా ఇంటర్నెట్‌ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపాడు. కాబట్టే తమకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలం అవసరమని పేర్కొన్నాడు.  

ప్రిగోజిన్‌కు వ్యతిరేకంగా
హ్యాకింగ్‌ గ్రూప్‌కు రష్యా సైబర్‌ మిలటరీ యూనిట్‌కు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే రష్యాతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆ సంస్థ ఖండించింది. పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుదారుడు, వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్  పారామిలటరీని అంతం చేయడానికి రష్యా ప్రభుత్వానికి మద్దతుగా ఈ హ్యాకింగ్‌ గ్రూప్‌ జూన్‌లో ఓ మెసేజ్‌ను సైతం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ హ్యాకింగ్ గ్రూప్ గతంలో ఫ్రాన్స్, నైజీరియా, ఇజ్రాయెల్, అమెరికాలో అలజడి సృష్టించింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)