Breaking News

జనరేటివ్‌ ఏఐపై పోటాపోటీ! సీఈవోలు ఏం చెప్పారంటే..

Published on Fri, 12/22/2023 - 10:16

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీల ప్రాధాన్యాలు మారిపోయాయి. అత్యంత ప్రాచుర్యం పొందుతున్న జనరేటివ్‌ ఏఐపై  టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీపై భారతీయ సీఈవోల దృక్పథం ఏంటన్నదానిపై తాజాగా ఓ సర్వే వెల్లడైంది.

అత్యధిక పెట్టుబడులు
జనరేటివ్‌ ఏఐ టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీల మధ్య పోటీ బాగా పెరిగింది. అనేక కంపెనీలు ఈ టెక్నాలజీపైనే అత్యధికంగా పెట్టుబడి పెడుతున్నాయి. భారత్‌కు చెందిన 50 మంది సీఈవోలపై నిర్వహించిన ఈవై సీఈవో అవుట్‌లుక్‌ పల్స్‌ 2023 సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. ఐదింట నాలుగొంతుల మంది సీఈవోలు ఈ జనరేటివ్‌ ఏఐపై అత్యధికంగా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోసం కొత్త పెట్టుబడులు పెట్టడమో లేదా ఇప్పటికే ఉన్న తమ బడ్జెట్‌ నుంచి కేటాంపులు మళ్లించడమో చేస్తున్నట్లు సర్వేలో పాల్గన్న సీఈవోల్లో 84 శాతం మంది తెలిపారు.

జనరేటివ్‌ ఏఐ వేగవంతమైన పురోగతి, నియంత్రణ వాతావరణం దీనికి సంబంధించిన మూలధన కేటాయింపులను ప్రభావితం చేస్తున్నట్లు 62 శాతం మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దీని వల్ల ఉద్యోగులపై పడే ప్రభావంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడం సవాలుగా మారిందని 80 శాతం పేర్కొన్నారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)