జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్
Breaking News
ఆదాయ మార్గం.. స్టూడియో అపార్ట్‌మెంట్
Published on Sat, 01/24/2026 - 07:49
స్థిరాస్తి రంగానికి తుది వినియోగదారులతో పాటు పెట్టుబడిదారులు కూడా ముఖ్యమే. అంతిమ కొనుగోలుదారులతో పోలిస్తే ఆదాయ మార్గంగా ఇన్వెస్టర్లు రియల్టీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుండటంతో ధరలు వేగంగా పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇల్లు, ఆఫీసు, రిటైల్, వేర్‌హౌస్‌ల మాదిరిగానే పెట్టుబడిదారులకు స్టూడియో అపార్ట్‌మెంట్లు కూడా ఆదాయ మార్గంగా మారాయి. ప్రధానంగా మెట్రో నగరాల్లో స్టూడియో అపార్ట్‌మెంట్లు హాట్ ఫేవరెట్స్‌గా మారాయి. –సాక్షి, సిటీబ్యూరో
ఎవరు కొంటారంటే?
సాధారణంగా బెడ్ కమ్ లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్‌డ్ బాత్‌రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్‌మెంట్ అంటారు. వీటిని అధికంగా విద్యార్థులు, బ్యాచిలర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు కొనుగోలు చేస్తుంటారు. ఈ తరహా అపార్ట్‌మెంట్లకు విస్తీర్ణం పరంగా కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. ఉపాధి, వ్యాపార కేంద్రాల పరిసర ప్రాంతాలలో, పర్యాటక కేంద్రాలకు చేరువలో, ఖరీదైన ప్రదేశాలలో ఉండే స్టూడియో అపార్ట్‌మెంట్లకు గిరాకీ అధికంగా ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

మన దగ్గర తక్కువే..
కరోనా తర్వాత విశాలమైన ఇళ్లకు ఆదరణ పెరగడంతో స్టూడి యో అపార్ట్‌మెంట్ల కస్టమర్లు పునరాలోచనలో ఉన్నారు. సాధారణంగా ఈ తరహా అపార్ట్‌మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాలలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్‌మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే.. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో అపార్ట్‌మెంట్ల ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి.
Tags : 1