Breaking News

బ్యాంకులు, ఫైనాన్స్‌ షేర్ల జోరు

Published on Wed, 01/29/2025 - 03:13

ముంబై: ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచేందుకు ఆర్‌బీఐ చర్యలు చేపట్టడంతో బ్యాంకులు, ఫైనాన్స్‌ షేర్లు రాణించాయి. వచ్చే నెల ద్రవ్య పరపతి సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే అంచనాలూ మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 535 పాయింట్లు పెరిగి 75,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 22,957 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా అదే ట్రెండ్‌ కొనసాగించాయి.

బ్యాంకులు, ఫైనాన్స్‌తో పాటు వడ్డీరేట్ల సంబంధిత షేర్లైన ఆటో, రియల్టీ, కన్జూమర్‌ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్‌ 1,145 పాయింట్లు బలపడి 76,513 వద్ద, నిఫ్టీ 308 పాయింట్లు ఎగసి 23,138 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే ట్రేడింగ్‌ చివర్లో ఫార్మా, ఇండస్ట్రీయల్, యుటిలిటీస్, క్యాపిటల్‌ గూడ్స్, విద్యుత్, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు కొంత లాభాలు కోల్పోయాయి. ట్రంప్‌ వాణిజ్య విధానాలపై అనిశ్చితులు, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, చైనా ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ ప్రకంపనల ప్రభావంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

⇒ ట్రంప్‌ వాణిజ్య సుంకాల పెంపు భయాలతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 86.57 వద్ద ముగిసింది.
⇒ ఆర్థిక వ్యవస్థలోకి రూ.1.50 లక్షల కోట్లు జొప్పించేందుకు ఆర్‌బీఐ పలు చర్యలు ప్రకటించడంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు మెరిశాయి. యాక్సిస్‌ బ్యాంకు 3.20%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 3%, ఐసీఐసీఐ బ్యాంకు 2.15%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2% లాభపడ్డాయి. బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంకు షేర్లు 1–0.50% పెరిగాయి. మరోవైపు ఫెడరల్‌ బ్యాంక్‌ 5%, యస్‌ బ్యాంక్‌ 1.5%, కెనరా బ్యాంకు 1% మేర నష్టపోయాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)