Breaking News

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Published on Mon, 10/30/2023 - 16:25

దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమై మార్కెట్‌ ముగిసే సమయానికి పుంజుకుని లాభాల్లోకి చేరుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 330 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 257 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 33 పాయింట్ల లాభంతో వారం మెుదటి రోజు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి. 

మార్కెట్‌లో వచ్చే తాత్కాలిక ర్యాలీ నిత్యం కొనసాగుతుందని భావించకూడదు. మార్కెట్లు గత వారం బాగా పడిపోవడంతో గతంతో పోలిస్తే స్టాక్‌లు కొంత డిస్కౌంట్‌లో దొరుకుతున్నాయని భావన ఉంటుంది. కానీ కంపెనీ ఫండమెంటల్స్‌, భవిష్యత్తు కార్యాచరణ తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అయితే ఏడాది చివరి నాటికి కూడా నిఫ్టీ మళ్లీ 20,000 పాయింట్ల కంటే దాటదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లు పశ్చిమాసియా వివాదానికి సంబంధించిన సంఘర్షణలను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు తీవ్రం అవుతుంటే మాత్రం ఆ ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా ఉండే అవకాశం ఉంటుంది.

సోమవారం మార్కెట్లు రికవరీ కావటంతో ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. ఈ క్రమంలో రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, ఓఎన్జీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఎల్ టి, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, నెస్లే, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కదలాడాయి. 

యూపీఎల్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఐటీసీ, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, హెచ్యూఎల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో పయనించాయి. 
 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)