Breaking News

మార్కెట్‌ మరింత స్పీడు!

Published on Mon, 06/30/2025 - 02:31

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత జోరు చూపవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. గత వారం అంచనాలకు అనుగుణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 84,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్‌ను దాటి నిలిచింది. ఈ స్పీడ్‌ కొనసాగనున్నట్లు అధిక శాతం మంది నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం..     – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌కు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. నేడు(30న) మే నెలకుగాను వార్షికంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), కరెంట్‌ ఖాతా 2025 జనవరి–మార్చి లోటు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో ఐఐపీ 2.7 శాతం పుంజుకుంది. 2024 అక్టోబర్‌–డిసెంబర్‌లో 11.5 బిలియన్‌ డాలర్ల లోటు నమోదైంది. మంగళవారం(జులై 1న) జూన్‌ నెలకు తయారీ రంగ పీఎంఐ, 3న సర్విసుల రంగ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఆర్డర్లరాకతోపాటు పరిశ్రమల రంగ ప్రగతిని తయారీ పీఎంఐ తెలియజేయనున్నట్లు బజాజ్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ పేర్కొంది. వీటికితోడు రుతుపవన కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. 

విదేశీ అంశాలు.. 
ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ మార్కెట్లకు సానుకూల అంశంకాగా.. 1న జపనీస్‌ తయారీ రంగ క్యూ1 వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజు జూన్‌ నెలకు చైనా తయారీ పీఎంఐ తెలియనుంది. 3న జూన్‌ నెలకు యూఎస్‌ ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా 9న యూఎస్‌ టారిఫ్‌ల గడువు ముగియనుంది. యూఎస్, భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు. గత వారం మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు తగ్గడంతో చమురు ధరలు చల్లబడ్డాయి. ఈ నేపథ్యంలో విదేశీ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నాయిర్‌ తెలియజేశారు.   

ఎఫ్‌పీఐల దన్ను 
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత వారం భారీస్థాయిలో రూ. 13,108 కోట్ల విలువైన దేశీ స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఫలితంగా జూన్‌లో ఇంతవరకూ నికరంగా రూ. 8,915 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లయ్యింది. ఆర్‌బీఐ రెపో రేటులో 0.5 శాతం కోతకుతోడు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు ఉపశమించడం, యూఎస్‌ టారిఫ్‌ల ఆందోళనలు సైతం తగ్గడం ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేస్తున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్‌ తెలియజేశారు. గతేడాది అక్టోబర్‌ మొదలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచి్చన ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌ చివరి నుంచి దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. వెరసి ఏప్రిల్‌లో నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా..మే నెలలో రూ. 19,860 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

26,100 పాయింట్లపై కన్ను 
అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో బ్రేకవుట్‌ నమోదైంది. 5 వారాలుగా ఒక పరిమిత శ్రేణిలోనే కదిలిన మార్కెట్లు పరిధిని చేదించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అంచనాలకు అనుగుణంగా సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్‌ను అధిగమించి నిలిచింది. ఫలితంగా 25,600 పాయింట్లను దాటింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 84,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. ఈ బాటలో మరింత బలపడే వీలున్నట్లు స్టాక్‌ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. వెరసి నిఫ్టీ 25,800 పాయింట్లను దాటి 26,100వరకూ పరుగు తీయవచ్చని భావిస్తున్నారు. మధ్యకాలంలో నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టం 26,277 పాయింట్లవైపు పరుగు తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాకాకుండా బలహీనపడితే 25,300 వద్ద మద్దతు లభించే వీలున్నట్లు పేర్కొన్నారు. 

గత వారమిలా 
ఐదు వారాల కన్సాలిడేషన్‌ తదుపరి గత వారం చివరి 4 రోజుల్లో మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ 2,162 పాయింట్లు జంప్‌చేసింది. దీంతో నికరంగా గత వారం సెన్సెక్స్‌ 1,651 పాయింట్లు(2 శాతం) జమ చేసుకుంది. 84,059 వద్ద ముగిసింది. ఈ బాటలో చివరి 4 రోజుల్లో 666 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ నికరంగా 525 పాయింట్లు(2.1 శాతం) లాభపడింది. 25,638 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ మరింత అధికంగా 2.35 శాతం, స్మాల్‌క్యాప్‌ 3.6 శాతం చొప్పున జంప్‌ చేయడం గమనార్హం! 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)