స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Published on Thu, 05/29/2025 - 09:49

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు పెరిగి 24,785కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 141 ప్లాయింట్లు పుంజుకుని 81,466 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 65 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.56 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.51 శాతం పడిపోయింది.

పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో స్టాక్‌ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు నిన్నటి మార్కెట్‌ సెషన్లో 3% పడి సూచీల పతనానికి ప్రధాన కారణమైంది. నిన్న సూచీలు ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. మే నెల వారీ ఎక్స్‌పైరీ గడువు ముగింపు(నేడు), దేశీయ క్యూ4 జీడీపీ, ఏప్రిల్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి వ్యవహరిస్తున్నారు. నిన్నటి సెషన్‌లో ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. పీఎస్‌యూ బ్యాంకులు, మీడియా, ఇంధన షేర్లు రాణించాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

కారులో నుండి రాకెట్ షాట్స్.. అప్పుడే న్యూయర్ రచ్చ షురూ జేసిండ్రు

పిల్లలను వెంటాడి చంపేస్తా..! తిరుమలలో సైకో హల్ చల్..

మాచర్లలో చీలిన టీడీపీ

అన్నంత పని చేసిన కిమ్.. షాక్ లో ప్రపంచ దేశాలు

అనంతలో గన్ కల్చర్

శ్రీశైలంలో ఘోరం.. 200 కేజీల మాంసం.. లిక్కర్ స్వాధీనం.. కార్లు సీజ్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. క్రేజీ అప్డేట్!

నన్ను లక్షకు అమ్మేశాడు.. కాపాడండి సార్

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఏఎస్సై

భార్యపై అనుమానంతో నిప్పు పెట్టిన భర్త

Photos

+5

కాజల్ అగర్వాల్ డిసెంబరు జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

TTD: అదే నిర్లక్ష్యం.. భక్తుల భద్రత గాలికి.. (ఫొటోలు)

+5

ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ శివజ్యోతి మరోసారి బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

క్రిస్మస్‌ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

ఈ ఏడాది మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన సమంత.. (ఫోటోలు)

+5

‘శంబాల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టీటీడీ ఘోర వైఫల్యం.. భక్తుల ఆగ్రహం (ఫొటోలు)

+5

‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్‌ విలియమ్స్‌ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)