Breaking News

సాక్షి మనీ మంత్ర: ప్రారంభ లాభాలు ఆవిరి..నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Published on Wed, 10/25/2023 - 16:03

దేశీయ సూచీలు బుధవారం భారీ నష్టాల్లోకి ట్రేడయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్‌ ముగిసేనాటి​కి నష్టాల్లో జారుకున్నాయి. అమెరికా బాండ్ల రాబడి పెరగడం, అధిక క్రూడాయిల్‌ ధరలు వంటివి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌ 522 పాయింట్ల మేర నష్టపోయి 64,049వద్దకు చేరింది. కాగా నిఫ్టీ 159 పాయింట్లు కుంగి 19,122కు చేరుకుంది. మార్కెట్లు ఒక్కసారిగా తలకిందులు కావటంతో దేశీయ పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.15 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది.

ప్రారంభంలో 65,619 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌.. కాసేపటికి నష్టాల్లోకి జారుకుని చివరి వరకు అలాగే కొనసాగించి. నిఫ్టీ 19286 వద్ద ప్రారంభమయింది. ఒకానొక సమయానికి 19074కు చేరుకుంది. చివరకు 19122 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.174గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, ఎం అండ్‌ ఎం, మారుతీసుజుకీ, నెస్లే మిగతా అన్ని స్టాక్‌లు  నష్టపోయాయి. 

ఇజ్రాయెల్-హమాస్ వివాదం కారణంగా ఉత్పన్నమయ్యే అనిశ్చితి మార్కెట్లపై ప్రభావం చూపుతూనే ఉంది. దాంతో బుధవారం భారతీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కుదేలయ్యాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం కనిష్ఠ స్థాయికి చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లోని భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా మార్కెట్లు బలహీనంగా మారాయి. దాంతో మదుపర్లు అమ్మకాలకు పూనుకున్నారు. ఈ పరిస్థితులపై కొంత స్పష్టత వచ్చే వరకు పెట్టుబడిదారులు మార్కెట్‌ను జాగ్రత్తగా పరిశీలించే అవకాశం ఉందనే వాదనలు ఉన్నాయి. నెలవారి డెరివేటివ్‌ల ముగింపునకు రేపు చివరితేది కావడంతో కూడా మార్కెట్లు నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)