Breaking News

స్టాక్‌ మార్కెట్లు.. వరుస నష్టాలు

Published on Fri, 06/13/2025 - 15:38

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పెరగడం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు పతనమయ్యాయి.

ఇంట్రాడేలో 80,354.59 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 573.6 పాయింట్లు (0.7 శాతం) క్షీణించి 81,118.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 169.6 పాయింట్లు లేదా 0.68 శాతం క్షీణించి 24,718.6 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.24 శాతం, 0.43 శాతం నష్టపోయాయి.

అయితే రంగాలవారీ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎనర్జీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్ లోని 30 షేర్లలో 26 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1 శాతానికి పైగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ మాత్రమే లాభపడ్డాయి.

ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 8.57 శాతం పెరుగుదలతో 73.87 డాలర్లకు ఎగసింది. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 7.6 శాతం పెరిగి 15.08 పాయింట్ల వద్ద స్థిరపడింది.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)