Breaking News

Stock market: సెప్టెంబర్‌లో సెలవులున్నాయా? ట్రేడింగ్‌ ఆగుతుందా?

Published on Sun, 08/31/2025 - 09:18

వినాయక చవితితో ఆగస్టు నెలాఖరులో ప్రారంభమైన పండుగ సీజన్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు తదుపరి స్టాక్ మార్కెట్ సెలవుల గురించి ఆలోచిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో ఏమైనా సెలవులు ఉన్నాయా.. ఎన్ని రోజులు ట్రేడింగ్‌ అందుబాటులో ఉంటుంది? అన్న సందేహాలుంటే ఈ కథనంలో తెలుసుకోండి.

గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్టు 27 బుధవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు వచ్చింది. తదుపరి మార్కెట్ సెలవు సెప్టెంబర్ లో కాకుండా అక్టోబర్ లో వస్తుందని ఇన్వెస్టర్లు గమనించాలి. అయితే, రెగ్యులర్ వారాంతపు సెలవులను పరిగణనలోకి తీసుకుంటే, సెప్టెంబర్‌ నెలలో ఎనిమిది రోజులు భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అందుబాటులో ఉండదు.
  
వారాంతాలు మినహా అక్టోబర్ లో మూడు రోజుల పాటు ఎన్‌ఎస్ఈ, బీఎస్‌ఈ రెండు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ట్రేడింగ్ కు మూతపడతాయని ఇన్వెస్టర్లు గమనించాలి. దసరా, దీపావళి, బలిప్రతిపాద వంటి పండుగ రోజులతో పాటు గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతీయ సెలవు దినాలను ఈ సెలవుల్లో చూడవచ్చు.

రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు
2025లో మిగిలిన ఏడాది స్టాక్ మార్కెట్ సెలవులు ఎప్పుడున్నాయి.. ఏ రోజుల్లో ట్రేడింగ్ ఉండదో ఇక్కడ చూడండి..
అక్టోబర్‌ 2 గురువారం గాంధీ జయంతి
అక్టోబర్‌ 21 మంగళవారం దీపావళి
అక్టోబర్‌ 22 బుధవారం బలిప్రతిపాద
నవంబర్‌ 5 బుధవారం ప్రకాశ్‌ గురుపురబ్‌ గురునానక్‌ దేవ్‌
డిసెంబర్‌ 25 గురువారం క్రిస్మస్‌

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో సెబీ ప్రత్యేక కార్యక్రమం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)