Breaking News

వచ్చేవారం స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ 3 రోజులే..

Published on Fri, 04/11/2025 - 18:09

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వచ్చేవారంలో మూడు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. వారాంతపు సెలవులు పోనూ సాధారణంగా వారంలో ఐదు రోజులపాటు స్టాక్‌ మార్కెట్లు తెరచి ఉంటాయి. కానీ వచ్చే వారంలో (ఏప్రిల్‌ 14 నుంచి) విశిష్ట దినోత్సవాలు, పండుగల కారణంగా రెండు రోజులు అదనపు సెలవులు వచ్చాయి. దీంతో డెరివేటివ్స్, ఈక్విటీలు, ఎస్ఎల్‌బీలు, కరెన్సీ డెరివేటివ్స్, వడ్డీరేట్ల డెరివేటివ్స్ ట్రేడింగ్ మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ప్రముఖ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ మార్కెట్ సెలవులను ముందుగానే నోటిఫై చేసి ఏటా ప్రచురిస్తాయి. 2025 ఏప్రిల్ నెలలో మొత్తం మూడు స్టాక్ మార్కెట్ సెలవులను ఎక్స్ఛేంజీలు నోటిఫై చేశాయి.  మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 10వ తేదీన ఇదివరకే స్టాక్‌మార్కెట్లు సెలవు దినంగా పాటించాయి. ఇక ఏప్రిల్‌ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, ఏప్రిల్‌ 14న గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది.

శని, ఆదివారాలు, ఎక్స్ఛేంజీలు ముందుగానే ప్రకటించిన సెలవులు మినహా వారంలోని అన్ని రోజుల్లో ఈక్విటీల విభాగంలో ట్రేడింగ్ జరుగుతుంది. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) విషయానికి వస్తే.. ఏప్రిల్ 18న (గుడ్ ఫ్రైడే) రెండు సెషన్లకు మూసివేసి ఉంటుంది. ఏప్రిల్ 14న ఉదయం సెషన్ (ఉదయం 09:00 - సాయంత్రం 5:00)కు మాత్రమే ఎక్స్చేంజ్ మూసివేసి సాయంత్రం సెషన్ లో (సాయంత్రం 5:00 - రాత్రి 11:30 / 11:55) ట్రేడింగ్ ను తిరిగి ప్రారంభిస్తుంది.

ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్ సెలవులు
ఏప్రిల్ 5 - శనివారం
ఏప్రిల్ 6 - ఆదివారం
ఏప్రిల్ 10 - మహావీర్ జయంతి
ఏప్రిల్ 12 - శనివారం
ఏప్రిల్ 13 - ఆదివారం
ఏప్రిల్ 14 - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి
ఏప్రిల్ 18 - గుడ్‌ఫ్రైడే
ఏప్రిల్ 19 - శనివారం
ఏప్రిల్ 20 - ఆదివారం
ఏప్రిల్ 26 - శనివారం
ఏప్రిల్ 27 - ఆదివారం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)