Breaking News

మార్చిలో 12 రోజులు స్టాక్ మార్కెట్ క్లోజ్‌!

Published on Sun, 03/02/2025 - 18:29

ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగియనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ నెలలో ట్రేడింగ్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ట్రేడింగ్‌ను బాగా ప్లాన్ చేయడానికి మార్చి నెలలో స్టాక్ మార్కెట్‌ ఏయే రోజుల్లో పనిచేస్తుంది.. ఎప్పుడు మూసివేత ఉంటుంది అన్నది తెలుసుకోవడం మంచిది. ఈ హాలిడే క్యాలెండర్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు జారీ చేస్తాయి. తమ అధికారిక వెబ్ సైట్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయి.

బీఎస్ఈ ప్రతి సంవత్సరం పూర్తి ట్రేడింగ్ హాలిడేస్ జాబితాను ప్రచురిస్తుంది. సాధారణంగా ఈ జాబితాలో పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులు ఉంటాయి. బడ్జెట్ సమర్పణ వంటి ప్రత్యేక సందర్భాలు మినహా అన్ని వారాంతాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. అందువల్ల మార్కెట్ షెడ్యూల్‌ను తెలుసుకుని తదనుగుణంగా ట్రేడింగ్‌ను ప్లాన్ చేయడానికి ఇన్వెస్టర్లు సెలవుల జాబితాపై ఆధారపడాలి.

మార్చిలో స్టాక్ మార్కెట్ కు 12 రోజులు సెలవులు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈ రోజుల్లో మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ లు చేయలేరు. వారాంతపు సెలవులతో పాటు ఈ నెలలో హోలీ, రంజాన్ పండుగకు కూడా మార్కెట్లు మూతపడతాయి. అందువల్ల మార్చిలో చివరి ట్రేడింగ్ రోజు 28వ తేదీ.  ఎందుకంటే 29, 30 తేదీలు వారాంతపు సెలవులు. ఆ రోజుల్లో మార్కెట్లు పనిచేయవు.

మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే
» మార్చి 1 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 2 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 8 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 9 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 14 శుక్రవారం హోలీ
» మార్చి 15 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 16 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 22 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 23 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 29 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 30 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)